భలేగా విన్యాసాలు చేసిన యువకుడు.. పోలీసులు ఏం చేశారంటే..?!

ప్రస్తుతం యువత సెల్ ఫొన్ లేకుండా ఉండటం లేదు.వీడియోలు, రీల్స్ సెల్ఫీలంటూ చిత్ర విచిత్ర ప్రయోగాలు చేస్తున్నారు.

 What Did The Police Do To The Young Man Who Did Great Stunts , Man , Great Stun-TeluguStop.com

ఇలా చేసి ఎంతో మంది తమ ప్రాణాలను సైతం కోల్పోయారు.అంతేకాకుండా ఇలా వీడియోలు చేసి, బైక్ స్టంట్లు చేస్తూ చనిపోయిన వారిలో ఎక్కువగా 20 ఏళ్ల వయసు వారు మాత్రమే ఉంటున్నారు.

బైక్ పై స్టంట్లు, వీడియోలు చేస్తూ అటు తమ ఫ్యామిలీలో విషాదం నింపడమే కాకుండా తోటి ప్రయాణికులను కూడా చిక్కుల్లో పడేస్తున్నారు.ఇలాంటి సంఘటనలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకున్నప్పటికీ యువతలో మార్పు అనేది రావడం లేదు.

ఇప్పటికీ చాలా మంది నడిరోడ్ల పై బైక్స్ మీద వీడియోలు తీసుకుంటూ నానా హంగామా చేస్తున్నారు.అయితే తాజాగా ఇలాంటి ఘటనే చెన్నైలో చోటు చేసుకుంది.ఓ యువకుల గ్యాంగ్ బైక్‌ పై స్టంట్లు చేశారు.అంతటితో ఆగకుండా దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

దీంతో అది కాస్త పోలీసుల కంట పడటంతో.వారిని అదుపులోకి తీసుకున్నారు.

సంఘటన వివరాల్లోకి వెళ్లితే.ద్రవిడ మున్నేట్ర కజహగం ప్రధాన కార్యాలయానికి ఎదురుగా, టేనాంపేట్ రహాదారిపై బైకర్ల గ్యాంగ్, బైక్ పై వివిధరకాల విన్యాసాలు చేస్తూ.ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేశారు.రోడ్డుపై అరుస్తూ.తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేశారు.అంతేకాకుండా వారు బైక్ పై చేసిన స్టంట్లను, ఎంజాయ్ చేస్తున్నటువంటి వీడియోను ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు.

దీంతో వీడియో కాస్త పోలీసులకు చిక్కింది.ఇక ట్విట్టర్ ఐడీని బట్టి పోలీసులు విచారణ జరిపి, వారి ట్విట్టర్ ఆధారంగా గ్యాంగ్ ముఠాను పట్టుకున్నారు.

అందులో ఐదుగురిని అదుపులోకి తీసుకోగా ప్రధాన నిందితుడైన హైదరాబాద్ కు చెందిన బినోస్ పరారీలో ఉన్నారని తెలిపారు.అంతేకాకుండా అతనికోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube