టాలీవుడ్ లెజెండరీ స్టార్ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు చనిపోయి 48 గంటలు కూడా కాక ముందే కొందరు సినిమా పరిశ్రమకు చెందిన వారు వేడుకలు నిర్వహించుకుంటూ కనిపించారు.ఈ విషయం లో ప్రభాస్ అభిమానులు మరియు కృష్ణంరాజు సన్నిహితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒక సీనియర్ స్టార్ హీరో మృతికి మరియు ఆయనకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఎంతో మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కృష్ణంరాజు మృతి సందర్భంగా కనీసం రెండు రోజులు లేదా మూడు రోజులు అయినా సంతాప దినాలుగా టాలీవుడ్ ప్రకటించి ఉంటే ఆయనకు గొప్ప నివాళి సమర్పించినట్లుగా అయ్యేది అనేది ఇండస్ట్రీ వర్గాల వారి అభిప్రాయం.
కానీ అదే ఇండస్ట్రీ కి చెందిన కొందరు మాత్రం నేడు ఉదయం నుండే అంటే 24 గంటలు కూడా గడవక ముందే షూటింగ్ లో పాల్గొన్నారు.షూటింగ్స్ అంటే పర్వాలేదు కానీ కొందరు ఈవెంట్స్ నిర్వహిస్తూ పార్టీలు సినిమా ప్రమోషన్లు అంటూ హడావుడి చేస్తున్నారు.
కృష్ణంరాజు చనిపోయిన కొన్ని గంటల్లోనే ఇలాంటి వాతావరణం సినిమా ఇండస్ట్రీలో ఉంటుంది అని తాము ఊహించలేదంటూ కొందరు మీడియా వర్గాల వారు చర్చించుకోవడం కనిపించింది.కృష్ణంరాజు అంటే ఎంతో గౌరవం అంటూ చెప్పే కొందరు కనీసం ఆయనకు గౌరవార్థంగా నేడు ఆయన యొక్క అంత్యక్రియలకు హాజరు కాలేదు.
పైగా షూటింగ్ అంటూ ఇతర కార్యక్రమాలు అంటూ బిజీ బిజీగా ఉన్నారు.ఇది ఎంత వరకు కరెక్ట్ అనేది వాళ్ళది ఆలోచించుకోవాలి.వారి మనసుని ప్రశ్నించుకోవాలి అంటూ ప్రభాస్ మరియు కృష్ణంరాజు అభిమానులు సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు కనీసం కృష్ణం రాజు మృత దేహం కి నివాళ్లు అర్పించేందుకు కూడా వెళ్లలేదు అనేది కొందరి వాదన.
కొందరు ట్విట్టర్ లో అయినా నివాళ్లు అర్పించలేదు అంటూ రెబల్ స్టార్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.







