శర్వానంద్ హీరోగా సమంత హీరోయిన్ గా నటించిన జాను సినిమా కమర్షియల్ గా సూపర్ హిట్ అవ్వలేదు, కానీ ఆ సినిమాతో సమంత మరియు శర్వానంద్ లు మంచి పేరునైతే దక్కించుకున్నారు వారిద్దరు మాత్రమే కాకుండా సమంత చిన్నప్పటి పాత్రలో నటించిన గౌరీ జి కిషన్ కూడా మంచి గుర్తింపును దక్కించుకుంది.స్కూల్ సన్నివేశాల్లో ఆ అమ్మాయి ని చూసి ప్రతి ఒక్కరు కూడా తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
జాను సినిమాలో చాలా క్యూట్ గా స్కూల్ అమ్మాయిల కనిపించిన గౌరీ ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అన్నట్లుగా వరుసగా అందాల ఆరబోత ఫోటో షూట్స్ ని ఇంస్టాగ్రామ్ ద్వారా వదులుతోంది.తాజాగా చీరకట్టు లో కనిపించి ప్రతి ఒక్కరిని కూడా కళ్ళు పెద్దవి చేసి చూసేలా చేసింది.
అందాల తార ముద్దుగుమ్మ గౌరి జి కిషన్ ని చూస్తుంటే ముందు ముందు ఒక స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ అమ్మడి గురించి పెద్ద ఎత్తున కామెంట్స్ వినిపిస్తున్నాయి.
సోషల్ మీడియాలో మరియు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా గౌరీ గురించిన వార్తలు వస్తున్న నేపథ్యంలో త్వరలోనే ఆమెకు సినిమాల ఆఫర్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.ప్రస్తుతం కూడా ఒకటి రెండు ఆఫర్లు ఆమె వద్ద ఉన్నాయి, కానీ వాటిని మించిన ఆఫర్లు అతి త్వరలోనే సైన్ చేసే అవకాశం ఉందంటూ కొందరు చాలా నమ్మకంతో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సమంత పాత్రలో నటించినందుకు గాను సమంత స్థాయిలో ఆమెకు గుర్తింపు రావడం ఖాయమని అలాగే సమంతకు దక్కినంత స్టార్ డం ఆమెకు కూడా దక్కుతుంది అంటూ సమంత అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.తప్పకుండా ఆమెకు మంచి ఆఫర్లు రావాలని మరింతగా ఆమె అందాల ఆరబోత చేయాలని కోరుకుందాం.







