దేశవ్యాప్తంగా కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు దాదాపు 3000 కిలోమీటర్లకు పైగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.భారత్ జోడోయాత్ర పేరిట జరుగుతున్న ఈ పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ రావడానికి రాహుల్ గాంధీ ఎంతో కృషి చేస్తూ ఉన్నారు.
ఇప్పటికే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే సిలిండర్ 500 రూపాయలకు ఇస్తామని.హామీ ఇవ్వడం కూడా జరిగింది.
ఈ క్రమంలో సెప్టెంబర్ 19వ తారీఖు నుండి 22 వరకు రాహుల్ తో కలిసి పాదయాత్ర చేయడానికి ప్రియాంక గాంధీ రెడీ అయినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
దాదాపు నాలుగు రోజులు భారత్ జూడో యాత్రలో రాహుల్ తో కలిసి ప్రియాంక గాంధీ పాదయాత్ర చేయనున్నారు.
దీంతో రోజు 22 నుంచి 23 కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా ప్రణాళిక రూపొందించారు.ఇప్పటికే భారత్ జూడో యాత్రకు ప్రజల నుండి ఆదరణ వస్తూ ఉండటంతో ప్రియాంక రాకతో పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.







