కృష్ణంరాజు సినిమాలలో ఆ పాట అంటే ప్రభాస్ కి అంత ప్రాణమా?

నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఇటు సినిమా రంగంలోనూ అటు రాజకీయ రంగంలో కూడా తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో దివంగత నటుడు కృష్ణంరాజు గారు ఒకరు.నటనపై మక్కువతో 1966లో చిలుకా గోరింక అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈయన అనంతరం వరుస సినిమా అవకాశాలను అందుకొని హీరోగా నటించడమే కాకుండా విలన్ గా కూడా తన రౌద్రంతో అందరిని భయపెట్టించారు.

 Is That Song In Krishnamrajus Movies The Life Of Prabhas Krishnamraju, Chiluka G-TeluguStop.com

ఇక ఒకానొక సమయంలో ఈయనకు అవకాశాలు లేక సతమతమవుతున్న సమయంలో గోపికృష్ణ మూవీస్ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు.

ఇలా సొంత బ్యానర్ లో ఈయన సినిమాలు చేసి తిరిగి ఇండస్ట్రీలో నిలదొక్కుకొని ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు.

ఇలా కృష్ణంరాజు గారు తన ఆరు దశాబ్దాల సినీ కెరియర్ లో సుమారు 180 కి పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులను సందడి చేశారు.ఇక ఈయన కెరియర్ లో నటించిన సినిమాల గురించి చెప్పుకోవాల్సి వస్తే ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ఇక ఈయన సినీ వారసుడిగా ప్రభాస్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

Telugu Chiluka Gorinka, Krishnamraju, Prabhas, Tollywood-Movie

ప్రభాస్ సైతం తన నటన నైపుణ్యంతో ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ నేడు పాన్ ఇండియా హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇలా ఇండస్ట్రీలో తన కుమారుడి ఎదుగుదల చూస్తూ కృష్ణంరాజు ఎంతో ఉప్పొంగిపోయారు.ఇక కృష్ణంరాజు గారు నటించిన సినిమాలలో కెల్లా ప్రభాస్ ఒక పాటంటే ఎంతో ప్రాణమని కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి ఓ సందర్భంలో వెల్లడించారు.

కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృష్ణంరాజు నటించిన త్రిశూలం సినిమాలోని రాయిని ఆడది చేసిన రామునివా.గంగను తలపై మోసే శివుడివా అనే పాట అంటే ప్రభాస్ కి ఎంతో ఇష్టమని శ్యామలాదేవి వెల్లడించారు.

కే.వీ.మహదేవన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, ఆత్రేయ లిరిక్స్ అందించారు.ఈ సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube