టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్నటువంటి మొట్టమొదటి తెలుగు చిత్రం వారసుడు.ఈ చిత్రాన్ని తెలుగు తమిళ భాషలలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
తమిళంలో ఈ చిత్రం వరిసు పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక ఈ చిత్రాన్ని దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్నటువంటి ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ విధంగా దిల్ రాజు నిర్మాణంలో భారీ బడ్జెట్ చిత్రంగా వస్తున్నటువంటి ఈ సినిమా ఇంకా షూటింగ్ పనులు జరుపుకుంటున్నట్లుగానే ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరలకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ఏకంగా 60 కోట్ల రూపాయలు చెల్లించి కైవసం చేసుకున్నట్లు సమాచారం.డిజిటల్ రైట్స్ 60 కోట్ల కుమ్ముడుపోయాయి అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.
కేవలం డిజిటల్ రైట్స్ మాత్రమే కాకుండా సాటిలైట్ రైట్స్ ను సన్ టీవీ ఏకంగా 50 కోట్లు చెల్లించి దక్కించుకున్నారు.

ఈ విధంగా డిజిటల్ రైట్స్ సాటిలైట్ రైట్స్ మాత్రమే కాకుండా మ్యూజికల్ రైట్స్ ను టి సిరీస్ 10 కోట్ల రూపాయలకు కైవసం చేసుకున్నారు.ఇలా ఈ సినిమా విడుదల కాకుండానే నాన్ థియేటర్ బిజినెస్ భారీగా జరిగింది కేవలం ఈ బిజినెస్ ద్వారానే నిర్మాత సేఫ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.ఇక ఈ సినిమా విడుదల థియేటర్ల ద్వారా రాబట్టే కలెక్షన్లన్నీ ఈ సినిమాకి బోనస్ అని అర్థమవుతుంది.
ఇక విజయ్ ఈ సినిమా ద్వారా మొదటిసారి తెలుగులో నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.







