కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు డ్యాంకు వరద ప్రవాహం పెరుగుతోంది.దీంతో అప్రమత్తమైన అధికారులు 14 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు.
ప్రస్తుతం డ్యాం ఇన్ ఫ్లో 90,570 క్యూసెక్కులుండగా.ఔట్ ఫ్లో 96,543 క్యూసెక్కులుగా కొనసాగుతుంది.ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా.ప్రస్తుతం 23.258 టీఎంసీలు ఉందని అధికారులు తెలిపారు.







