సినిమా ఇండస్ట్రీలో నటుడిగా రాజకీయ జీవితంలో కేంద్ర మంత్రిగా ఎన్నో సేవలను అందించినటువంటి కృష్ణంరాజు గారు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నేడు ఉదయం మృతి చెందారు.సినిమాపై మక్కువతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన 80 సంవత్సరాల వయసులో కూడా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేశారు.
ఈ విధంగా ఆయన ప్రభాస్ నటించినటువంటి రాధే శ్యామ్ సినిమాలో చివరిగా నటించారు.
ఇక కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఈయన మృతి చెందడంతో పలువురు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు ఈయన మృతి పై స్పందిస్తూ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సైతం కృష్ణం గారి మృతి పట్ల స్పందిస్తూ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు రెబల్ స్టార్ కృష్ణం గారి మృతి బాధాకరం.నటుడిగా రాజకీయ నాయకుడిగా ఆయన ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయం.కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఈయన మృతిపై స్పందిస్తూ తన సంతాపం ప్రకటించారు.







