కృష్ణా జిల్లా గుడివాడ వన్ టౌన్ పోలీస్స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.వైసీపీ మాజీమంత్రి కొడాలి నానిపై ఫిర్యాదు చేసేందుకు టీడీపీ నేతల ప్రయత్నించారు.
ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయం వద్ద నేతలను పోలీసులు అడ్డుకున్నారు.దీంతో పోలీసులను తోసుకుంటూ పీఎస్ కు చేరుకున్నారు.
ఈ క్రమంలో టీడీపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య చెలరేగిన వివాదం తోపులాటకు దారితీసింది.దీంతో ఉద్రిక్తత నెలకొంది.







