Apple బ్రాండ్ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ఐఫోన్.అవును, ఆ బ్రాండ్ అంతలాగ జనాల్లోకి దూసుకుపోయింది.
Apple అంటే ఒక బ్రాండ్ కాదు ఒక స్టేటస్ అని భావించేవారు కూడా వున్నారు.మనచుట్టూ అనేకమంది కేవలం ఎదుటివారికి తమ దర్పాన్ని చూపించుకోవడం కోసమే Apple ఫోన్ వాడతారు అనే విషయం అందరికీ తెలిసినదే.
ఇకపోతే మీరు చూడండి….యాపిల్‌కు సంబంధించిన ఉత్పత్తుల పేర్లన్నీ ఐ తోనే ఆరంభమవుతాయి.
ఐప్యాడ్, ఐపాడ్, ఐమ్యాక్… ఇలా ఉంటాయన్నమాట.అయితే మీకు ఓ సందేహం వచ్చే ఉంటుంది కదా!దాని వెనకాల వున్నా కథేమిటో ఇపుడు తెలుసుకుందాం.1998లో యాపిల్ మొదటి ఉత్పత్తి ఐమ్యాక్ విడుదలైంది.ఇంటర్నెట్ జనాదరణ పొందుతున్న తొలినాళ్లలో మార్కెట్లోకి వచ్చిన ఈ కంప్యూటర్ అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలిచింది Apple.
వేగంగా, సులభంగా ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యేలా చేయడంలో ఐమ్యాక్ సూపర్ సక్సెస్ అయ్యింది.మార్కెట్లోని ఇతర కంప్యూటర్లతో పోల్చితే రికార్డుస్థాయి అమ్మకాలు అప్పట్లో సాధించి రికార్డులకెక్కింది.అప్పటికే ‘ఐ’ పై అనేక కథలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో స్పందించిన యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ స్పష్టతనిచ్చారు.
ప్రజలకు వేగంగా ఇంటర్నెట్‌ను అందించడమే ఐమ్యాక్ పని కాబట్టి.
ఐ అంటే ఇంటర్నెట్అని ఆయన చెప్పారు.ఇక సంస్థాగతంగా చూసినా కూడా.
I అంటే – Individual, Inspire, Inform, Instruct ఇలా పలు అర్థాలను ఉద్యోగుల సమావేశంలో ఓసారి వివరించారు జాబ్స్.ఈ క్రమంలోనే సంస్థ తర్వాతి ఉత్పత్తులైన ఐఫోన్(2007), యాపిల్ టీవీ, యాపిల్ వాచ్ వంటి అనేక ఉత్పత్తుల పేర్లు ‘ఐ’ అని వచ్చేలా ప్రారంభించారు.యాపిల్‌కు ఓ డిక్షనరీ అంటూ ఉంటే.‘ఐ’ కి ఇంటర్నెట్అ నేదే సరైన నిర్వచనమని టెక్ నిపుణులు అభివర్ణిస్తుంటారు.







