బిగ్ బాస్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 షో ఇటీవల సెప్టెంబర్ 4వ తేదీన గ్రాండ్ గా మొదలైన విషయం తెలిసిందే.ఈ షో మొదలయ్యే నేటికీ వారం రోజులు పూర్తి అయ్యింది.
ఇక ఈరోజు హౌస్ లో నుంచి ఎవరో ఒకరు కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యి బయటకు రావాల్సిందే.దీంతో మొదటివారం హౌస్ లో నుంచి ఏ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యి బయటకు రాబోతున్నారు అన్న విషయం తెలుసుకోవాలి అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మరొకవైపు హౌస్ లోని కంటెస్టెంట్లు ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న విషయంతో టెన్షన్ టెన్షన్ గా ఉన్నారు.
ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ షో మొదలయ్యి వారం రోజులు కూడా పూర్తి కాలేదు హౌస్ లో ఒక కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ కాలేదు అప్పుడే బిగ్ బాస్ సీజన్ విన్నర్ ఎవరు అన్న దానిపై ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి.
మామూలుగా అయితే రెండు మూడు వారాల తర్వాత హౌస్ లో కంటెస్టెంట్ ల ప్రవర్తనను బట్టి ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారు ఎవరు విన్నర్ గా నిలుస్తారు అన్నది అంచనా వేస్తుంటారు.
అయితే కొన్ని కొన్ని సార్లు ముందుగా సోషల్ మీడియాలో వినిపించిన వార్తలు ప్రకారమే కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి.గత సీజన్లో అయితే ప్రేక్షకులు ముందుగానే అనుకున్న విధంగా చాలామంది కంటెస్టెంట్ లు హౌస్ నుంచి ఎలిమినేట్ అవడమే కాకుండా వీజే సన్నీ తప్పకుండా గెలుస్తాడు అన్న వార్త కూడా నిజం అయింది.
అలాగే ఓటిటి విన్నర్ బిందు మాధవి నే అన్న విషయాన్ని కూడా ముందే చెప్పేసిన విషయం తెలిసిందే.ఆ అంచనాలు కూడా తప్పలేదు.ఇక బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ గా ఎవరు నిలుస్తారు అంటే సింగర్ రేవంత్ పేరు వినిపిస్తోంది.

అదేంటి బిగ్ బాస్ హౌస్ లో రేవంత్ ఎంట్రీ ఇవ్వడం తుని బూతులు మాట్లాడారు కదా, అందులోనూ రేవంత్ మరీ అంత స్ట్రాంగ్ కంటెంట్ గా కనిపించడం లేదు కదా అంటే ఇదంతా కూడా బిగ్ బాస్ స్ట్రేటజీలో భాగమే అంటున్నారు ప్రేక్షకులు.గత సీజన్ విన్నర్ అయిన సన్నీ కూడా మొదటి వారమే అవుట్ అవుతాడు అన్న విధంగా అందరికీ టార్గెట్ అయ్యి చివరికి విన్నర్ గా నిలిచాడు.ఇక ప్రస్తుతం రేవంత్ కూడా సన్నీ అదే తరహాలో ప్రవర్తిస్తున్నాడు అని చెప్పవచ్చు.
ఇప్పటికైతే పలువురు విన్నర్ గా రేవంత్ అని ఫిక్స్ అయ్యారు.మరి చివరికి సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ వార్తలు నిజమవుతాయా లేదా చూడాలి మరి.







