అందరి ముందే నితిన్ ను బండబూతులు తిట్టిన స్టార్ డైరెక్టర్.. ఎవరంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి జయం సినిమా ద్వారా పరిచయమయ్యి మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయాన్ని అందుకున్న నటుడు నితిన్ గురించి చెప్పాల్సిన పనిలేదు.మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ కావడంతో ఈయనకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి.

 Director Teja Scold Hero Nithin In Jayam Movie Shooting Details, Nithin,jayam Mo-TeluguStop.com

ఇలా అవకాశాలను అందుకున్న నితిన్ హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.ఈయన నటించిన మొట్టమొదటి చిత్రం జయం తేజ దర్శకత్వంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే.

ఇక తేజ దర్శకత్వంలో వచ్చే సినిమాలలో ప్రతి ఒక్క సన్నివేశాన్ని ఎంతో పర్ఫెక్ట్ గా ఉండేలా చర్యలు తీసుకుంటారు.తను అనుకున్న విధంగా ఆ సన్నివేశం రావడం కోసం ఈయన ఎన్ని టేకులు తీసుకోనైనా ఆ సన్నివేశాన్ని ఎంతో పర్ఫెక్ట్ గా తెరకెక్కిస్తారు.

ఇక షూటింగ్ సమయంలో ఈయనకి కనుక కోపం వస్తే నటీనటులపై చేయి చేసుకోవడానికి కూడా వెనకాడరు.ఈ క్రమంలోనే నితిన్ హీరోగా వచ్చిన జయం సినిమా విషయంలో కూడా నితిన్ కు డైరెక్టర్ తేజ నుంచి చేదు అనుభవం ఎదురయిందని ఈయన ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.

ఈ సినిమాలో ఓ సన్నివేశంలో భాగంగా నితిన్ తన కళ్ళల్లో బాధ కనిపించేలా ఎక్స్ప్రెషన్స్ పెట్టాల్సి ఉంది.

Telugu Teja, Gopichand, Sadaa, Jayam, Nithin, Nithin Teja, Scold Nithin, Tollywo

అయితే నితిన్ కు ఇది మొదటి సినిమా కావడంతో తేజకు కావలసినటువంటి ఎక్స్ప్రెషన్స్ పెట్టలేకపోయారట.అయితే తేజ తాను అనుకున్న ఎక్స్ప్రెషన్స్ రావడం కోసం చాలా టేకులు తీసుకున్నారని అయినప్పటికీ ఆసీన్ కరెక్ట్ గా రాకపోవడంతో దద్దమ్మ ఈ మాత్రం చేయడం కూడా చేతకాదా అంటూ అందరి ముందే దారుణంగా అవమానించారని నితిన్ పేర్కొన్నారు.తేజ ఇలా మాట్లాడేసరికి ఒక్కసారిగా సదా గోపీచంద్ వంటి వారు షాక్ అయ్యారని,ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే ఆ సన్నివేశం రాగానే తనకు ఆ రోజు తేజ అన్న మాటలే గుర్తుకు వస్తాయని నితిన్ ఓ సందర్భంగా తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube