ట్విట్టర్లో మీరు చేసిన ట్వీట్ ఎడిట్ చేసుకోవచ్చు తెలుసా?

ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ట్విట్టర్ వినియోగదారులు బాగానే వున్నారు.చిన్నవాళ్ళనుండి పెద్ద పెద్ద సెలిబ్రిటీల వరకు దీనిని విరివిగా వినియోగిస్తున్నారు అనే విషయం తెలిసినదే.

 Did You Know You Can Edit Your Tweets On Twitter , Twitter, Edited, Features, Te-TeluguStop.com

ఈ క్రమంలో అనేకమంది వినియోగదారులు ఓ విషయంలో ఇబ్బంది పడుతూ వుంటారు.అదే తాము చేసిన ట్వీట్ ఎడిటింగ్ ఎలా చేయాలో తెలియక కాస్త తికమక పడుతూ వుంటారు.

అందువలనే చాలా మంది ఆ ట్వీట్ ని డిలీట్ చేసి మళ్ళీ ట్వీట్ చేస్తూ ఉంటారు.అయితే అలా ట్వీట్ ని ఎడిట్ చేసుకోవాలి అని అనుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది ట్విట్టర్ యాజమాన్యం.

విషయం ఏమంటే, ట్విట్టర్ లో ట్వీట్ చేసిన తర్వాత దానిని ఎడిట్ చేసే ఫీచర్ ను త్వరలోనే ట్విట్టర్ యాజమాన్యం తీసుకురానుందట.ఈ అభివృద్ధి చేయడంతో పాటుగా మరి కొంతమంది యూజర్ల ద్వారా ప్రయోగాత్మకంగా పరీక్షించి చూసినట్టు ట్విట్టర్ తాజాగా ప్రకటించింది.

ఇక త్వరలోనే దీన్ని అమల్లోకి తీసుకురానున్నట్టు బ్లాగ్ లో తెలిపింది ట్విట్టర్ యాజమాన్యం.అయితే ఇక్కడ కొన్ని నియమ నిబంధనలు వున్నాయి మరి.ఈ ట్వీట్ చేసిన తర్వాత 30 నిమిషాల వరకు దాన్ని ఎడిట్ చేసుకోవచ్చని 30 నిముషాల సమయం మించిపోతే ఎడిట్ చేసుకోవడానికి ఉండదు అని యాజమాన్యం తెలిపింది.

Telugu Ups, Tweet-Latest News - Telugu

అంతేకాకుండా మనం చేసిన ఆ ట్వీట్ ను 30 నిమిషాల్లోపు సుమారు 5 సార్లు ఎడిట్ చేసుకోవచ్చని తెలిపింది.అయితే అలా ఎడిట్ చేసిన ఆ ట్వీట్ అందరికీ తెలిసేలా దానికి ప్రత్యేకంగా ఐకాన్ కనిపిస్తుందట.దాంతో అసలు ట్వీట్ ఎడిటింగ్ కు గురైనట్టు యూజర్లకు తప్పుకుండా తెలుస్తుంది.

అంతేకాదు దాని పై ట్యాప్ చేస్తే ఎడిట్ హిస్టరీ కూడా కనిపిస్తుందట.అయితే ఈ ఫీచర్ ప్రస్తుతానికి కేవలం ట్విట్టర్ బ్లూ సబ్ స్క్రిప్షన్ ఉన్న వారికు మాత్రమే.

మన దేశంలో బ్లూ సబ్ స్క్రిప్షన్ అందుబాటులో లేదు.అమెరికా, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి ఎంపిక చేసిన దేశాలలోనే ఇది అందుబాటులో వుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube