తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవునున్నాయని ప్రకటించింది.
ఈ నేపథ్యంలో నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.







