అమరావతి రైతుల మహా పాదయాత్రకు ముహుర్తం ఖరారైంది.పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో రైతులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
ఉద్యమం ప్రారంభమై వెయ్యి రోజులు అవుతున్న సందర్భంగా.అమరావతి నుంచి అరసవల్లి వరకు పాదయాత్ర చేపట్టాలని రైతులు నిర్ణయించారు.
ఈనెల 12 వ తేదీన వేకువ జామున 5 గంటలకు ఈ మహా పాదయాత్రను ప్రారంభించనున్నారు.ముందుగా వెంకటపాలెంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు.ప్రత్యేకంగా సిద్ధం చేసిన శ్రీవారి రథానికి.9 గంటల సమయంలో జెండా ఊపి లాంఛనంగా యాత్రను ప్రారంభిస్తారు.
ఈ కార్యక్రమంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా మిగిలిన అన్ని పార్టీలు పాల్గొననున్నాయి.అదేవిధంగా అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతు జేఏసీ సమన్వయ కమిటీ సభ్యులు కూడా ఇందులో పాల్గొననున్నారు.
అయితే, హైకోర్టు తీర్పు మేరకు పాదయాత్రలో పాల్గొనే వారి వివరాలను డీజీపీ కార్యాలయంలో అందజేశారు.