చైతన్య ఎలుకలా మారిపోతాడంటూ అఖిల్ షాకింగ్ కామెంట్స్.. ఏమైందంటే?

నాగచైతన్య, అఖిల్ ఒక తల్లి కడుపున పుట్టకపోయినా ఎంతో సన్నిహితంగా ఉంటారనే సంగతి తెలిసిందే.నాగచైతన్య, అఖిల్ ఒకరి నుంచి మరొకరు చాలా సందర్భాల్లో పాజిటివ్ గా చెప్పుకున్నారు.

 Akhil Shocking Comments About Nagachaitanya Goes Viral In Social Media Details,-TeluguStop.com

చిన్నప్పుడు చైతన్య, అఖిల్ బాగా గొడవ పడే వాళ్లని సమాచారం.అయితే ఒకే ఒక జీవితం ప్రమోషన్స్ లో భాగంగా అమల, అఖిల్ నాగచైతన్య గురించి చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అమల చై అన్నయ్యకు ఇష్టమైన ఫుడ్ ఏంటని అడగగా చైతన్య అన్నయ్యకు ఐస్ క్రీమ్ తో పాటు స్వీట్స్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు.అర్ధరాత్రి చైతన్య అన్న ఎలుకలా మారిపోతాడని అఖిల్ చెప్పుకొచ్చారు.

ఎలుకలా ఫ్రిజ్ లో చిన్నచిన్న ముక్కలు కొరికి చైతన్య పెట్తేస్తాడని అఖిల్ కామెంట్లు చేశారు.తనకు కూడా ఐస్ క్రీమ్ అంటే ఇష్టమని అఖిల్ వెల్లడించగా ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఐస్ క్రీమ్ తిని బ్రతికేస్తున్నారని అఖిల్ చెప్పుకొచ్చారు.

Telugu Akhil, Akkineni Akhil, Akkineni Amala, Chiranjeevi, Cream, Nagachaitanya,

చిరంజీవికి ఇష్టమైన ఆహారం ఏంటని అమల అడగగా స్టీమ్ దోశ అని అఖిల్ సమాధానం చెప్పారు.జూనియర్ ఎన్టీఆర్ కు హలీం అంటే ఇష్టమని రామ్ చరణ్ కు పప్పు అప్పడం అంటే ఇష్టమని అఖిల్ కామెంట్స్ చేశారు.ప్రభాస్ ను కలిసిన సమయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభాస్ 30 నుంచి 40 వంటకాలను మన ముందు పెట్టేస్తాడని అఖిల్ వెల్లడించారు.

Telugu Akhil, Akkineni Akhil, Akkineni Amala, Chiranjeevi, Cream, Nagachaitanya,

చాలారోజుల తర్వాత శర్వానంద్ ఒకే ఒక జీవితం సినిమాతో తాను కోరుకున్న విజయాన్ని అందుకున్నారు.కమర్షియల్ గా కూడా ఈ సినిమా సక్సెస్ ను సొంతం చేసుకుంటే శర్వానంద్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.ఒకే ఒక జీవితం సినిమాకు 14 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube