బిగ్ బాస్ సీజన్6 కంటెస్టెంట్లలో ఒకరైన బాలాదిత్య ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.చదువు విషయంలో అమ్మగారు పెద్దపీట వేశారని బాలాదిత్య అన్నారు.
స్కూల్ కన్నా షూటింగ్ లకు ఎక్కువగా వెళ్లానని కానీ ఏరోజుకు ఆరోజు చదువుకున్నానని ఆయన అన్నారు.అన్నయ్య నోట్స్ రాసిచ్చేవాడని బాలాదిత్య అన్నారు.
చంటిగాడు సినిమా సమయంలో చదువు కంటిన్యూ చేయాలని అమ్మ మాట తీసుకుందని బాలాదిత్య అన్నారు.
నా చదువు విషయంలో అమ్మ కీలక పాత్ర పోషించిందని బాలాదిత్య తెలిపారు.
ఇప్పటికీ అన్నయ్య, వదిన ఏం చెబితే అది ఫాలో అవుతున్నానని బాలాదిత్య తెలిపారు.నాన్న ఎప్పుడూ నా మీద చెయ్యి వెయ్యలేదని బాలాదిత్య తెలిపారు.
నాన్న స్టైల్ వేరు అని బాలాదిత్య పేర్కొన్నారు.నా ఇష్టానికి నాన్న ప్రాధాన్యత ఇచ్చేవారని బాలాదిత్య తెలిపారు.
నువ్వు ఎవ్వరికీ జవాబుదారీ కాదని నాన్న చెప్పేవారని ఆయన అన్నారు.
నన్ను చూసిన తర్వాత చంటిగాడు సినిమా కథ తయారైందని ఆయన కామెంట్లు చేశారు.2009లో కెరీర్ కు బ్రేక్ పడిందని ఆయన అన్నారు.చిన్న వయస్సులోనే హీరో కావద్దని అమ్మ చెప్పారని బాలాదిత్య తెలిపారు.
జూనియర్ ఎన్టీఆర్, ఉదయ్ కిరణ్, తరుణ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కావడంతో నేను కూడా సినిమాల్లోకి రావాలని అనుకున్నానని బాలాదిత్య వెల్లడించారు.
ఇప్పుడు ప్రేక్షకులకు నచ్చే సినిమాలను తెరకెక్కించడమే కష్టమని ఆయన తెలిపారు.పొలిమేర ప్రాజెక్ట్ నా కెరీర్ కు ప్లస్ అయిందని ఆయన అన్నారు.కరోనా సమయంలో ఓటీటీలు ఇండస్ట్రీకి సపోర్ట్ ఇచ్చాయని ఆయన తెలిపారు.
ప్రతిభ ఉన్నవాళ్లందరికీ అవకాశాలు దక్కుతున్నాయని బాలాదిత్య కామెంట్లు చేశారు.బిగ్ బాస్ షో తర్వాత బాలాదిత్య కెరీర్ పరంగా బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.