లైగర్ హీరోయిన్ తో బ్రేకప్ పై స్పందించిన మాజీ ప్రియుడు.. ఏం అన్నాడంటే?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ప్రేమలో పడటం బ్రేకప్ చెప్పుకోవడం సర్వసాధారణమే ఈ క్రమంలోనే బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటుడు సాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ కట్టర్ కొన్ని రోజులపాటు రిలేషన్ లో ఉండి అనంతరం విడిపోయారని పెద్ద ఎత్తున బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఇలా వీరిద్దరి బ్రేకప్ గురించి ఎన్నో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తలపై ఇషాన్ స్పందించి క్లారిటీ ఇచ్చారు.

 Ex Boyfriend Reacts To The Breakup With The Liger Heroine What Did He Say, Lig-TeluguStop.com

తాజాగా ఇషాన్ కత్రినా కైఫ్ సిద్ధాంత్ చతుర్వేది కలిసి కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఇషాన్ తన బ్రేకప్ గురించి స్పందించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా కరణ్ జోహార్ ఇషాన్ ను ప్రశ్నిస్తూ అనన్య పాండేతో నువ్వు విడిపోయావు కదా అని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ ప్రస్తుతం తాను సింగిల్ గా ఉన్నానని చెప్పారు.

ఇప్పుడు అనన్యతో స్నేహంగా ఉంటున్నారా అని ప్రశ్నించడంతో ఇషాన్ ఈ విషయంపై మాట్లాడుతూ.నా జీవితాంతం ఆమెకు మంచి స్నేహితుడిగా ఉండాలని కోరుకుంటున్నాను.ఇప్పటివరకు తన లైఫ్ లో నాకు తెలిసిన వాళ్ళలో మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్ అనన్య పాండే అంటూ ఇషాన్ తన బ్రేకప్ గురించి సమాధానం చెప్పారు.

Telugu Ananya Pandey, Breakup, Ishaan, Liger, Sahid Kapoors-Movie

ఈ విధంగా ఇషాన్ చెప్పిన సమాధానం వింటే వీరిద్దరూ నిజంగానే బ్రేకప్ చెప్పుకున్నారని అయితే బ్రేకప్ అనంతరం మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారని తెలుస్తోంది.ఇకపోతే అనన్య పాండే తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఈ సినిమా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేయలేకపోయినా అనన్య తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube