బాలకృష్ణ పుట్టినరోజున విడుదలైన చిరంజీవి సినిమా.. మూవీ రిజల్ట్ ఏంటంటే?

మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి.ఒక దశలో చిరంజీవి నటిస్తే సినిమా హిట్ అనే భావన ప్రేక్షకుల్లో ఉందంటే చిరంజీవి రేంజ్ ఏమిటో సులువుగా అర్థమవుతుంది.

 Interesting Facts About Chiranjeevi Khaidi Number 786 Movie Details Here , Chira-TeluguStop.com

చిరంజీవి కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో ఖైదీ నంబర్ 786 కూడా ఒకటి.దర్శకనిర్మాత విజయబాపినీడు మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం.

పట్నం వచ్చిన పతివ్రతలు వీళ్లిద్దరి కాంబినేషన్ లో కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి సినిమా అనే సంగతి తెలిసిందే.

చిరంజీవి, బాపినీడు ఒకరినొకరు ఎంతగానో గౌరవించుకునేవారు.విజయ బాపినీడు నిర్మాతగా చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఖైదీ నంబర్786 బాలయ్య పుట్టినరోజైన జూన్ 10వ తేదీన విడుదలై ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.1988 సంవత్సరంలో ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది.విజయ బాపినీడు ఈ సినిమా విజయోత్సవ కార్యక్రమంలో చిరంజీవికి ఏనుగును బహుమతిగా ఇవ్వడం గమనార్హం.

దేశంలో సినిమా హీరోకు ఈ తరహా కానుక ఇచ్చిన ఏకైక దర్శకనిర్మాత విజయబాపినీడు కావడం గమనార్హం.

ఆ తర్వాత చిరంజీవి ఏనుగును టీటీడీకి కానుకగా ఇవ్వడం జరిగింది.ఈ సినిమా 100 రోజుల ఈవెంట్ ఉదయం, సాయంత్రం జరగడం గమనార్హం.ఈ సినిమాలోని గువ్వా గోరింకతో సాంగ్ ఏ స్థాయిలో హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు.

Telugu Balakrishna, Chiranjeevi, Godfather, Khaidi Number-Movie

మరోవైపు చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా మరో నాలుగు వారాల్లో థియేటర్లలో విడుదల కానుంది.చిరంజీవి మోహన్ రాజా కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కగా చిరంజీవి కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా 100 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కింది.

చిరంజీవికి సినిమాసినిమాకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube