సమంత యశోద టీజర్.. యాక్షన్ తో ఆదరగొట్టిందిగా!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత విడాకుల తర్వాత విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకొని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.ఈ క్రమంలోనే ఈమె హరి-హరీష్‌ దర్శకత్వం వహించినటువంటి యశోద అని లేడీ ఓరియంటెడ్ సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమయింది.

 Samantha Yashoda Teaser With Action Details, Samantha ,yashoda Teaser, Lady Orie-TeluguStop.com

మణిశర్మ సంగీత సారథ్యంలో శ్రీదేవీ మూవీస్‌ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు.ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్నటువంటి ఈ టీజర్ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకొని సినిమాపై అంచనాలను పెంచుతుంది.

టీజర్ చూస్తుంటే ఈ సినిమా క్రైమ్ త్రిల్లర్ మూవీ మాత్రమే కాదని, సస్పెన్స్ డ్రామాగా కూడా ఉన్నట్టు అర్థమవుతుంది.హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తీసిపోకుండా సమంత యాక్షన్ సన్నీ వేషాలలో ఎంతో అద్భుతంగా నటించారు.

ఇందులో సమంత ప్రెగ్నెంట్ అనే విషయాన్ని కూడా తెలియజేశారు.

Telugu Thriller, Hari Harish, Lady, Samantha, Samanthayashoda, Yashoda Teaser-Mo

ఇలా గర్భవతిగా ఉన్న సమంత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఆ ఇబ్బందుల నుంచి బయటపడటం కోసం సాహసం చేస్తున్నట్లు చూపిస్తూ టీజర్ కట్ చేశారు.మొత్తానికి ఈ టీజర్ చూస్తుంటే సినిమాపై ఎన్నో అంచనాలు కలుగుతున్నాయి.ఇక ఈ సినిమాలో సమంత ఎంతో అమాయకంగా కనిపించే అమ్మాయిగా చూపించారు.

మొత్తానికి ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచిందని చెప్పాలి.ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube