సమంత యశోద టీజర్.. యాక్షన్ తో ఆదరగొట్టిందిగా!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత విడాకుల తర్వాత విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకొని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.

ఈ క్రమంలోనే ఈమె హరి-హరీష్‌ దర్శకత్వం వహించినటువంటి యశోద అని లేడీ ఓరియంటెడ్ సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమయింది.

మణిశర్మ సంగీత సారథ్యంలో శ్రీదేవీ మూవీస్‌ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

 ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు.ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్నటువంటి ఈ టీజర్ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకొని సినిమాపై అంచనాలను పెంచుతుంది.

టీజర్ చూస్తుంటే ఈ సినిమా క్రైమ్ త్రిల్లర్ మూవీ మాత్రమే కాదని, సస్పెన్స్ డ్రామాగా కూడా ఉన్నట్టు అర్థమవుతుంది.

హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తీసిపోకుండా సమంత యాక్షన్ సన్నీ వేషాలలో ఎంతో అద్భుతంగా నటించారు.

ఇందులో సమంత ప్రెగ్నెంట్ అనే విషయాన్ని కూడా తెలియజేశారు. """/" / ఇలా గర్భవతిగా ఉన్న సమంత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఆ ఇబ్బందుల నుంచి బయటపడటం కోసం సాహసం చేస్తున్నట్లు చూపిస్తూ టీజర్ కట్ చేశారు.

మొత్తానికి ఈ టీజర్ చూస్తుంటే సినిమాపై ఎన్నో అంచనాలు కలుగుతున్నాయి.ఇక ఈ సినిమాలో సమంత ఎంతో అమాయకంగా కనిపించే అమ్మాయిగా చూపించారు.

మొత్తానికి ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచిందని చెప్పాలి.

ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వైరల్ వీడియో: ఢిల్లీ మెట్రో ట్రాక్‌పై మహిళ.. చివరకి.?