స్టార్ హీరోయిన్ సమంతకు ప్రస్తుతం దేశంలోని అన్ని భాషల్లో క్రేజ్ ఉంది.సమంత డిమాండ్ చేస్తే ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సైతం సిద్ధంగా ఉన్నారు.
సోషల్ మీడియాలో సమంత యాక్టివ్ గా ఉండటంతో పాటు తన గురించి ఎలాంటి విమర్శలు వ్యక్తమైనా ధీటుగా బదులిస్తారనే సంగతి తెలిసిందే.చాలా సంవత్సరాల పాటు సమంత చైతన్య ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.
కారణాలు ఏవైనా ఒకరితో ఒకరు కలిసుండలేక కుటుంబ సభ్యులను ఒప్పించి చైసామ్ విడాకులు తీసుకున్నారు.చైతన్యకు సమంత విషయంలో ఎలాంటి కోపం లేదని పలు సందర్భాల్లో ప్రూవ్ అయింది.
భవిష్యత్తులో పరిస్థితులు మారితే చైతన్య సమంత కలిసే ఛాన్స్ కూడా కొంతమేర ఉంది.చైతన్య నుంచి సమంత విడిపోయినా చైతన్య ఆస్తులలో సమంత ఏమీ తీసుకోలేదు.అదే సమయంలో సమంత భరణంగా ఏమీ కోరలేదు.

మనస్పర్ధలు మినహా చైసామ్ విడిపోవడానికి మరీ బలమైన కారణాలు లేవని కామెంట్లు వినిపించాయి.చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత చాలా బాధ పడ్డారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.సమంతకు రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కానీ లేదు.
కెరీర్ పరంగా ఆమె చాలా బిజీగా ఉన్నారు.అనవసర విషయాలకు ఆమె ప్రాధాన్యతనివ్వడం లేదు.
అయినప్పటికీ ఆమె రెండో పెళ్లి గురించి ఫేక్ న్యూస్ వైరల్ అవుతుండటంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

ఏం తప్పు చేసిందని సమంతను ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారని ఆమె ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.సమంత మనస్తత్వం దాచుకునే మనస్తత్వం కాదని ఏ పని చేసినా ముందుగానే హింట్ ఇస్తుందని అభిమానులు చెబుతున్నారు.సమంత వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేయవద్దని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
సమంత నటించిన యశోద సినిమా నుంచి రేపు టీజర్ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.







