గత నాలుగు ఐదు రోజులుగా సోషల్ మీడియాలో సమంత పేరు మారు మోగిపోతుంది.ఏదో ఒక విషయంలో సమంత పేరు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.
కాగా ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో బిజీ బిజీగా ఉంది సమంత.టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.
ఇది ఇలా ఉంటే తాజాగా సమంతకు సంబంధించిన మరొక వార్త సోషల్ మీడియాలో తన చెక్కర్లు కొడుతోంది.అదేమిటంటే సమంత ప్రస్తుతం చర్మానికి సంబంధించిన వ్యాధితో బాధపడుతుంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కాగా సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతున్నప్పటికీ సమంత మాత్రం ఈ విషయంపై స్పందించకపోవడం ఆశ్చర్య పోవాల్సిన విషయం.సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోవడంపై అనేక రకాల వార్తలు వినిపించగా ఆ వార్తలపై స్పందించిన సమంత మేనేజర్ సమంత మూడు నెలల వరకు మీడియా ముందుకు రాదని, యశోద సినిమా విడుదల సమయంలో మీడియా ముందుకు వస్తుందని తెలిపాడు.
కాగా సమంత ప్రస్తుతం ముంబైలో ఉంటున్న విషయం తెలిసిందే.బాలీవుడ్ ఇండస్ట్రీ పై ఫోకస్ పెట్టిన సమంత అక్కడే ఉంటూ అక్కడే సెటిల్ అవ్వాలని చూస్తున్నట్లుగా సమాచారం.

ఇటువంటి సమయంలో ఇలా సమంత స్కిన్ కీ సంబంధించిన వార్త వైరల్ కావడం బాధాకరం అని చెప్పవచ్చు.కాగా ఇదివరకే సమంత ఒక చర్మ సంబంధిత వ్యాధితో బాధపడిన విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు మళ్లీ అదే సమస్య వచ్చిందా అంటే వార్తలు అవుననే సమాదానాలు వినిపిస్తున్నాయి.ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో కుదిపేస్తున్న మరొక వార్త సమంత సోషల్ మీడియాలో ఎందుకు యాక్టివ్ గా కనిపించడం లేదు.
ఈ వార్త గత కొద్దిరోజుల సోషల్ మీడియా లో వినిపిస్తున్నప్పటికీ సమంత మాత్రం ఆ విషయంపై స్పందించకపోవడం విశేషం.







