ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వీరవాసారం జనసేన పార్టీ తరఫున జడ్పిటిసి గెలిచిన నేత గుండా జయ ప్రకాష్ పై తెలంగాణలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.విషయంలోకి వెళ్తే తెలంగాణలో రొయ్యలు మరియు చేప పిల్లల సరఫరా టెండర్లను అక్రమంగా దక్కించుకున్న వ్యవహారంలో పోలీసులు ఫోర్జరీ కేసులు నమోదు చేశారు.
టెండర్లకు సంబంధించి బ్యాంక్ కి నకిలీ గ్యారెంటీలు సమర్పించి రొయ్యలు, చేప పిల్లల సరఫరా టెండర్లు దక్కించుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
దీంతో తెలంగాణ అధికారులు దర్యాప్తు చేపట్టి.
టెండర్లకు సంబంధించి గూండా జయప్రకాష్ సమర్పించిన గ్యారెంటీ పత్రాలు నకిలీవని, అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసినట్లుగా గుర్తించారు.దీంతో ఏపీ జనసేన పార్టీ నేతా జయప్రకాష్ పై క్రిమినల్ కేసులు నమోదు అయినట్లు సమాచారం.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ప్రాంతానికి చెందిన జనసేన నాయకుడు గూండా జయప్రకాష్ పలువురి పేర్లతో తెలంగాణలో 9 నుంచి 12 జిల్లాలలో ఈ టెండర్లను దక్కించుకోవడం జరిగింది.బ్యాంకు గ్యారెంటీ, పెర్ఫార్మెన్స్ గ్యారెంటి విషయంలో మోసాలకు పాల్పడినట్లు గుర్తించినట్లు సమాచారం.







