తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై సౌందర్ రాజన్ మూడేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్నారు.ఈ సందర్భంగా రాజ్‌భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆమె ప్రసంగించారు.
ఎన్ని అడ్డంకులు ఎదురైన తన పని తాను చేసుకుంటూ వెళ్తానని తెలిపారు.మంచి చేయాలనేది తన స్వభావమన్న తమిళిసై.
వివక్షను ఎట్టి పరిస్థితుల్లో సహించనని పేర్కొన్నారు.తనకు గౌరవం ఇవ్వకపోయిన తన బాధ్యతలను నిర్వహిస్తానని వెల్లడించారు.
ప్రజా సమస్యలను తెలుసుకునే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనట్లు తమిళిసై తెలిపారు.ఈ క్రమంలోనే ప్రజల సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో రాజ్‌భవన్ తలుపులు తెరిచామన్నారు.
తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే సమ్మక్క -సారక్క జాతరకు వెళ్లే సమయంలో ప్రభుత్వం స్పందించలేదన్నారు.ఆ కారణంగానే 8 కిలోమీటర్లు రోడ్డు ప్రయాణం చేసి వెళ్లాల్సి వచ్చిందని వ్యాఖ్యనించారు.
ఏ కార్యక్రమంలోనూ అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని వాపోయారు.వ్యక్తిగతంగా బాధపడటం లేదు కానీ.
కనీసం రాజ్‌భవన్‌ను అయినా గౌరవించాలని కదా అని తమిళిసై ప్రశ్నించారు.







