మహేష్ కు సగం శ్రమ తగ్గించేసిన జక్కన్న.. అయినా అద్భుతమే!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా ఇటీవలే గ్రాండ్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.మహేష్ బాబు ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.

 Interesting News On Mahesh Babu Rajamouli Movie Details, Mahesh Babu, Trivikram,-TeluguStop.com

ఇక ఇందులో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.హారిక హాసిని బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమా తర్వాత మహేష్ బాబు అగ్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు.ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా కోసం రచయిత విజయేంద్ర ప్రసాద్ ఒక పవర్ ఫుల్ స్టోరీని సిద్ధం చేసినట్టు టాక్.ఇక ఈ సినిమా బడ్జెట్ కూడా అదే స్థాయిలో ఉండనుందని వార్తలు వస్తున్నాయి.

రాజమౌళి తన సినిమాలలో వీఎఫ్ఎక్స్ కి అత్యంత ప్రాధాన్యత ఇస్తాడు అనే విషయం తెలిసిందే.అయితే సినిమాలో సహజత్వం కూడా ఏమాత్రం పోకుండానే తన సినిమాలను జాగ్రత్తగా తీయడంలో రాజమౌళి తనకు తానే సాటి.

ఇక ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోతున్న సినిమాకు కూడా జక్కన్న వీఎఫ్ఎక్స్ భారీగానే వాడబోతున్నట్టు టాక్.

స్కిప్ట్ కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేయకుండానే రాజమౌళి వీఎఫ్ఎక్స్ వర్క్ కోసం విదేశాలకు సైతం వెళ్లి వచ్చాడు అంటేనే అర్ధం అవుతుంది ఏ స్థాయిలో ఆయన గ్రాఫిక్స్ వాడబోతున్నాడో.

ఈ సినిమా భారీ యాక్షన్ అడ్వెంచర్ కావడంతో ఈ సన్నివేశాలకు భారీ ఖర్చు రాజమౌళి సరికొత్త టెక్నాలజీతో సినిమాలు చేయబోతున్నాడు కాబట్టి తక్కువ ఖర్చుతో అవుతుందట.

Telugu Forest Backdrop, Mahesh Babu, Mm Keeravani, Rajamouli, Rajamoulimahesh, S

ఇక టెక్నాలజీ కారణంగా మహేష్ బాబు కష్టం కూడా చాలా తగ్గిస్తున్నాడట.ఈయన గ్రాఫిక్స్ కారణంగానే మహేష్ కు కొద్దిగా పని తగ్గినా రాజమౌళి మాత్రం మహేష్ ను రెండేళ్ల పాటు వదిలిపెట్టే ఛాన్స్ అయితే లేదు.మరి ఇంత గ్రాఫిక్స్ తో అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు అంటేనే సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ సినిమాకు కూడా కీరవాణి సంగీతం అందించనున్నాడు.ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తూనే బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు జక్కన్న.చూడాలి మరి ఈ సినిమా లాంచింగ్ ఎప్పుడు అవుతుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube