ఆ ఒక్క సినిమా వల్ల ఆరేళ్లు కష్టపడ్డా.. ఇప్పుడు అప్పులు తీరాయి: శర్వానంద్

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ తాజాగా నటించిన చిత్రం ఒకే ఒక జీవితం. ఇందులో శర్వానంద్ సరసన రీతు వర్మ హీరోయిన్ గా నటించింది.

 Sharwanand About His Flop Movie Ko Ante Koti , Sharwanand , Ko Ante Koti Movie ,-TeluguStop.com

కాగా ఈ సినిమాతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.ఇకపోతే ఈ సినిమాలో అక్కినేని అమల, వెన్నెల కిషోర్ ప్రియదర్శి లు కీలకపాత్రలో నటించారు.

కాగా ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది.ఈ సందర్భంగా సినిమా విడుదలకు మరికొద్ది రోజులే సమయం ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది.

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శర్వానంద్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ.

తను హీరోగా నటించిన పడి పడి లేచి మనసు సినిమా కచ్చితంగా ఆడుతుంది అని అనుకున్నాడట.కానీ ఆ సినిమా ఫ్లాప్ అయినప్పుడు షాక్ లోకి వెళ్లిపోయాను అని చెప్పుకొచ్చాడు శర్వానంద్.

ఆ తర్వాత రెండు మూడు నెలల పాటు తన రూమ్ లో నుంచి బయటకు రాలేదని, ఆ సినిమా కోసం తన అమ్మ బంగారం తాకట్టు పెట్టి మరి కో అంటే కోటి సినిమాను తీశాం అని చెప్పుకొచ్చాడు శర్వానంద్.ఆ సినిమాకు నేనే నిర్మాతను.

డబ్బులు అన్ని పోయాయి.రిలేషన్స్‌ దూరమయ్యాయి.

తట్టుకోలేకపోయాను.

Telugu Flop, Ko Ante Koti, Sharwanand, Tollywood-Movie

ఆ అప్పులు తీర్చడానికి ఆరేళ్లు పట్టింది.అన్ని సంవత్సరాలపాటు ఒక్క షర్ట్‌ కూడా కొనలేదు. రన్‌రాజా రన్‌ సినిమా హిట్టయినప్పుడు ప్రభాస్‌ అన్న పిలిచి ఇంట్లో పార్టీ ఇచ్చాడు.

నాకేమో నిజంగా హిట్‌ కొట్టామా? అని డౌట్‌లో ఉన్నాను అని తెలిపాడు శర్వానంద్.మరి శర్వానంద్ తాజాగా నటించిన ఈ ఒకే ఒక జీవితం సినిమా ఏ మేరకు సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube