దర్శకుడు మణిరత్నం తాజాగా దర్శకత్వం వహించిన సినిమా పొన్నియిన్ సెల్వన్.చోళుల స్వర్ణయుగాన్ని ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మణిరత్నం.
అయితే కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా రూపొందించిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం చెన్నైలో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టాలీవుడ్ అగ్రనటులు అయిన రజనీకాంత్, కమల్ హాసన్ లు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా హీరో రజనీకాంత్ మాట్లాడుతూ.
ప్నొనియిన్ సెల్వన్ సినిమా లోని వంతియాతివన్ అనే పాత్రకు నేను చక్కగా సూట్ అవుతానని గతంలో ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జయలలిత చెప్పారు.
ఆమె చెప్పిన మాటతోనే నేను పొన్నియిన్ సెల్వన్ పుస్తకం కూడా చదివాను.
ఒకవేళ రచయిత కల్కి మన మధ్య కనుక ఉండి ఉంటే ఆయన ఇంటికి వెళ్లి పాదాలకు నమస్కారం చేసేవాడిని అని చెప్పుకొచ్చారు రజినీకాంత్.పొన్నియిన్ సెల్వన్ అనేది అరుళ్ మొళివర్మన్ కథ కాదు నందిని కథ.ఇక ఇప్పుడున్న రోజుల్లో నందిని పాత్రని ఎవరూ చూసి ఉండరు.నరసింహ సినిమాలో నీలాంబరి పాత్రకు నందిని పాత్రే స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు రజినీకాంత్.
పొన్నియిన్ సెల్వన్ కథ చదివిన తర్వాత ఈ సినిమాలో నేను కూడా నటించాలని అనుకున్నాను.

అప్పుడు దర్శకుడు మణిరత్నం ను కలిసి నేను ఇందులో పళు వెట్టరైయార్ పాత్రలో నటిస్తానని,చిన్న పాత్ర అయినా ఫర్వాలేదు, నేను చేస్తానని చెప్పగా దానికీ మణిరత్నం గారు స్పందిస్తూ…మీ అభిమానులతో నన్ను తిట్టించాలనుకుంటున్నావా? అని అడిగారు.నేను తమ సినిమాలో నటిస్తానంటే వేరే ఎవరైనా సరేనని ఒప్పుకొనేవారు.కానీ, మణి మాత్రం అస్సలు ఒప్పుకోలేదు.
అదీ మణిరత్నం అంటే అని చెప్పుకొచ్చారు రజినీకాంత్.







