దివ్యాంగులకు ట్రై సైకిల్ పంపిణీ చేసిన సత్తుపల్లి ఎమ్మెల్యే, పోలీస్ కమిషనర్

దివ్యాంగుల అండగా మేమున్నామంటూ….భరోసా కల్పించడం స్పూర్తిదాయకమని పోలీస్ కమిషనర్ విష్ణు యస్.

 Sattupalli Mla And Pc Distributes Tri Cycles To Physically Handicapped, Sattupal-TeluguStop.com

వారియర్ అన్నారు.

చేతన ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో….

సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారి ఆధ్వర్యంలో దివ్యాంగులకు వీల్ చైర్స్, ట్రై సైకిల్ పంపిణీ కార్యక్రమం సత్తుపల్లి పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో జరిగింది.

కార్యక్రమానికి ముఖ్యతిధిగా హజరైన పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ చేతుల మీదుగా 60 మందిదివ్యాంగులకు వీల్ చైర్స్, ట్రై సైకిల్ పంపిణీ చేశారు.

కార్యక్రమంలో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు మాట్లాడుతూ…సామాజిక సేవ దృక్పథంతో చేతన ఫౌండేషన్ సేవలు అందిస్తున్నారని అన్నారు.

ప్రవాస భారతీయులైన చేతన ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వెనిగళ్ళ రవి కుమార్ రేణుక దంపతులు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని గతంలో కూడా కల్లూరు, తలాడ, పెనుబల్లి మండలాల్లోని 70 మంది దివ్యాంగులకు ట్రై సైకిల్ పంపిణీ చేయడం జరిగిందని కొనియాడారు.

ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంధాలయ శాఖ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు.

మరియు.మున్సిపల్ చైర్మన్ కోసం పూడి మహేష్ మొదలగువారు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube