తిరుపతి నగరంలోని తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చెడ్డి గ్యాంగ్ కలకలం చెలరేగింది.బృందావన కాలనీలో ప్రహరీ గోడ దూకి ఓ ఇంట్లోకి ప్రవేశించారు.
ఈ క్రమంలో సీసీ కెమెరాలను దుండగులు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు.గ్యాంగ్ లో ఓ వ్యక్తి ఇనుప రాడ్డు పట్టుకుని తచ్చాడుతున్న దృశ్యాలు సీసీ టీవీ పుటేజ్ లో రికార్డ్ అయ్యాయి.
దీంతో సమీప గ్రామ ప్రజలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు.అప్రమత్తమైన తిరుచానూరు పోలీసులు.
చడ్డి గ్యాంగ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.







