కాకినాడలో కేంద్రీయ విద్యాలయ విద్యార్థుల అస్వస్థత మిస్టరీగా మారింది.పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థినీ, విద్యార్థులు ఊపిరి ఆడటం లేదంటూ కుప్పకూలిన విషయం తెలిసిందే.
అయితే 24 గంటలు గడుస్తున్న పిల్లల అస్వస్థతకు గల కారణాలు తెలియరాలేదు.ప్రస్తుతం బాధిత విద్యార్థులు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మరోవైపు వలసపాక కేవీకి నేడు మైక్రో బయాలజీ నిపుణులు చేరుకున్నారు.అక్కడి పరిస్థితులను పరిశీలించిన అనంతరం విద్యార్థుల అస్వస్థతకు గల కారణాలపై నిపుణుల కమిటీ విచారించనుంది.
ఇప్పటికే కేవీలోని మంచినీళ్లు, చాక్లెట్ల శాంపిల్స్ ను పరీక్షల నిమిత్తం జేఎన్టీయూ ల్యాబ్ కు పంపించారు అధికారులు.







