అయ్యయ్యో ! కవితమ్మకు పెద్ద కష్టమే వచ్చిందమ్మ ?

ప్రతి విషయంలోనూ బీజేపీతో తాడోపేడో అన్నట్లుగా టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.దీనికి మాటలతో బిజెపి నాయకులు సరిపెడుతూ విమర్శలకు దిగుతున్నారు.

 Ed Officials Raided Hyderabad Targeting Trs Mlc Kavitha Details, Kavitha, Trs, T-TeluguStop.com

కేంద్రం పైన , బీజేపీ అగ్ర నేతల పైన కెసిఆర్ ఎంతగా విమర్శలు చేసినా, బిజెపి అగ్ర నాయకులు ఎవరు ఆ స్థాయిలో కేసీఆర్ ను టార్గెట్ చేసుకోలేదు.కేవలం తెలంగాణ బిజెపి నాయకులు మాత్రమే టిఆర్ఎస్ పై విమర్శలు చేసేవారు .అయితే బిజెపి అగ్రనేతలే టార్గెట్ గా కేసీఆర్ అనేక వ్యవహారాలు చేస్తూ,  తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న క్రమంలో బిజెపి అగ్రనేతల సైతం ప్రతికార ప్రజలకు దిగినట్టుగా కనిపిస్తున్నారు.టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కెసిఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను టార్గెట్ చేసుకున్నట్టుగా కనిపిస్తున్నారు.

ఇటీవల ఢిల్లీలో బయటపడిన లిక్కర్ స్కాం వ్యవహారంలో కవిత పాత్ర కూడా ఉన్నట్లుగా అనేక ఆధారాలను చూపిస్తూ , బిజెపి విమర్శలు చేసింది.అయితే ఈ వ్యవహారంలో తన తప్పేమీ లేదని , తనపై ఎటువంటి ఆరోపణలు చేయకుండా చూడాలంటూ కవిత కోర్టుకు కూడా ఎక్కారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం తాము ఈడీలకు,  బోడీలకు భయపడే రకం కాదని మిగిలిన రాష్ట్రాల్లో మాదిరిగా తెలంగాణలో  రాజకీయం చేద్దామంటే కుదరని పని అంటూ ఆమె వ్యాఖ్యానించారు.ఇక కవిత సైతం ఇదే రకమైన విమర్శలను చేస్తూ బిజెపి ఆరోపణలు తిప్పుకొట్టే ప్రయత్నం చేశారు.

  ఇక  బిజెపి సైతం వీరిని వదిలిపెట్టేలా కనిపించడం లేదు.దీనికి నిదర్శనంగానే ఈరోజు ఉదయం దేశవ్యాప్తంగా దాదాపు చాలాచోట్ల ఈడి అధికారులు సోదాలు నిర్వహించారు.
 బెంగళూరు, చెన్నై వంటి ముఖ్య నగరాల్లో తనిఖీలు చేపట్టారు.

Telugu Central Bjp, Kavitha, Telangana-Political

ఇక హైదరాబాదులోనూ అనేక చోట్ల తనిఖీలు చేశారు.దీనిలో ప్రధానంగా రాబిన్ డిస్ట్లరీ పేరుతో వ్యాపార వ్యవహారాలు నిర్వహిస్తున్న రామచంద్రన్  నివాసంలో తనిఖీలు చేపట్టారు.అంతేకాకుండా మరో ఐదుగురు ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు.

బోయినపల్లి అభిషేక్ రావు,  సూదిని సృజన్ రెడ్డి, గండ్ర ప్రేమ్ సాగర్ నివాసాలు ఆఫీసులకు ఈడీ అధికారులు వెళ్లినట్లు సమాచారం.అభిషేక్ రావు,  ప్రేమ్ సాగర్ లు ఇద్దరు ఎమ్మెల్సీ కవిత వద్ద పనిచేస్తారనే ప్రచారం జరుగుతోంది.

  ప్రస్తుతం కవిత వద్ద పనిచేస్తున్న వారు , ఆమెకు అత్యంత సన్నిహితులుగా ముద్రపడిన వారిని ఈడి అధికారులు టార్గెట్ చేసుకున్నారని , కవిత లక్ష్యంగా హైదరాబాదులో ఈడి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.కవితను లిక్కర్ స్కామ్ లో  సంబంధం ఉందని తేల్చడం ద్వారా , జాతీయస్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్న కెసిఆర్ దూకుడుకు కళ్ళు వేసేందుకు బిజెపి అగ్ర నేతలు ప్రయత్నిస్తున్నారని టిఆర్ఎస్ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube