మెగా ఫ్యామిలీ నుంచి రావడం రావడమే ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్.ఉప్పెన హిట్ ఊపుతో క్రిష్ డైరక్షన్ లో కొండపొలం సినిమా చేశాడు.
అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేదు.ఉప్పెన తర్వాత వైష్ణవ్ తేజ్ కి కొండపొలం ద్వారా షాక్ తగిలింది.
ఇక మరోపక్క రీసెంట్ గా రంగ రంగ వైభవంగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వైష్ణవ్ తేజ్.ఈ సినిమాలో కెతిక శర్మ హీరోయిన్ గా నటించింది.
అర్జున్ రెడ్డి తమిళ సినిమా ఆదిత్య వర్మ డైరెక్ట్ చేసిన గిరీ శాయ డైరక్షన్ లో రంగ రంగ వైభవంగా సినిమా వచ్చింది.
రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఆ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది.
ఉప్పెన హీరో ఆ తర్వాత తీసిన రెండు సినిమాలతో మెప్పించలేకపోయాడు.ఇక మీదట కథల విషయంలో వైష్ణవ్ తేజ్ జాగ్రత్త పడాల్సి ఉంటుంది.
రొటీన్ సినిమాలు కాకుండా డిఫరెంట్ గా ప్రయత్నిస్తే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ కోరుతున్నారు.మరి వైష్ణవ్ తేజ్ నెక్స్ట్ సినిమా ఎలాంటి అటెంప్ట్ చేస్తాడో చూడాలి.







