రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన బాహుబలి బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడంతో పాటు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చిందనే సంగతి తెలిసిందే.
రాజమౌళి తన డైరెక్షన్ స్కిల్స్ తో ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించి ఎన్నో రికార్డులు ఈ సినిమా ఖాతాలో చేరడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమయ్యారు.ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్లలో ఒకరైన రాకేష్ రోషన్ ఈ సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
క్రిష్ సిరీస్ సినిమాల ద్వారా అభిమానులకు దగ్గరైన డైరెక్టర్లలో రాకేష్ రోషన్ ఒకరనే సంగతి తెలిసిందే.క్రిష్ సిరీస్ సినిమాలకు దేశవ్యాప్తంగా ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.
త్వరలో క్రిష్4 మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని అధికారికంగా వెల్లడైంది.తాజాగా రాకేష్ రోషన్ మాట్లాడుతూ బాలీవుడ్ దర్శకనిర్మాతలు తాము, తమ స్నేహితులు చూడటానికి మాత్రమే సినిమాలను తెరకెక్కిస్తున్నారని చెప్పుకొచ్చారు.
దేశంలో చాలా తక్కువమంది ఆడియన్స్ కు మాత్రమే అలాంటి సినిమాలు నచ్చుతాయని ఆయన కామెంట్లు చేశారు.ఇతర ప్రేక్షకులతో సంబంధం లేని కథలను బాలీవుడ్ దర్శకనిర్మాతలు ఎంచుకుంటున్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ రీజన్ వల్లే హిందీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించడం లేదని ఆయన అన్నారు.సౌత్ డైరెక్టర్, నిర్మాతలు జనాల జీవితాలను చూపించే కథలకు కట్టుబడి ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు.

సౌత్ డైరెక్టర్లు, నిర్మాతలు కమర్షియల్ సెన్సిబిలిటీ విషయంలో అప్ గ్రేడ్ గా ప్రదర్శిస్తున్నారని ఆయన తెలిపారు.బాహుబలి సినిమా బాలీవుడ్ మూవీ అయిన కరణ్ అర్జున్ ను పోలి ఉంటుందని ఆయన వెల్లడించారు.అయితే భారీస్థాయిలో తెరకెక్కించడం, పాటలను కూడా భారీగా చూపించడం ఆ సినిమా సక్సెస్ కు కారణమైందని ఆయన చెప్పుకొచ్చారు.రాకేష్ రోషన్va చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







