బుల్లితెర పై ప్రసారమవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది.ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్ ల పేర్లు ఈ కార్యక్రమానికి ముందే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.
అయితే ఈ కార్యక్రమంలో ప్రముఖ యాంకర్ ఉదయభాను పాల్గొనబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ ఆ వార్తలలో నిజం లేదని తెలిసిపోయింది.ఇకపోతే ఈ కార్యక్రమానికి ఉదయభాను రాకపోవడానికి ఎన్నో కారణాలు వినిపించాయి.
సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం బిగ్ బాస్ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఉదయభాను సంప్రదించారని అయితే ఈ కార్యక్రమంలో ఉదయభాను పాల్గొనడం కోసం ఏకంగా వారానికి నాలుగు లక్షల రూపాయలు డిమాండ్ చేయడంతో అంత మొత్తంలో నిర్వాహకులు రెమ్యూనరేషన్ ఇవ్వలేని నేపథ్యంలో ఉదయభాను విషయంలో బిగ్ బాస్ నిర్వాహకులు లైట్ తీసుకున్నారని తెలుస్తుంది.ఇలా ఇండస్ట్రీలో యాంకర్ గా నటిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఉదయభానుకి ఎంతో మంచి క్రేజ్ ఉంది.
ఈ క్రమంలోనే ఈమె బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఈమె వారానికి నాలుగు లక్షల రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.ఇంత మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వలేని నిర్వాహకులు ఈమె విషయంలో లైట్ తీసుకోవడం వల్లే ఉదయభాను బిగ్ బాస్ కార్యక్రమానికి రాలేకపోయారని తెలుస్తోంది.ఇకపోతే కొంతకాలం నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఉదయభాను ప్రస్తుతం పలు ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.ఈ నేపథ్యంలోనే ఈమె బిగ్ బాస్ కార్యక్రమంలోకి రాబోతుందని వార్తలు వచ్చాయి.