అవును, మీరు విన్నది నిజమే.కేవలం పడుకుంటే మీకు లక్షల్లో డబ్బులు వస్తాయి.
పడుకోవడం అంటే తప్పుడు అర్ధం తీసుకోబోయేవారు కాబోలు.అది ఒక గేమ్.
వారిచ్చిన టాస్క్ లో గెలిచినవారికి దాదాపు ఐదు లక్షల బహుమతి ఇస్తారు.ఆమె అందులో విజయ పతాకాన్ని ఎగరవేసింది.ఆమె కుంభకర్ణుడి చెల్లెలేమి కాదు.నిద్రాదేవి కూతురు ఎంతమాత్రమూ కాదు.అయినా ఆమె ఆ పరీక్షలో నెగ్గింది.దేశవ్యాప్తంగా బెస్ట్ స్లీప్ ఛాంపియన్ పోటీని ఒక ప్రైవేట్ మ్యాట్రెస్ కంపెనీ నిర్వహించగా, అందులో పశ్చిమ బెంగాల్ హుగ్లీకి చెందిన త్రిపర్ణ చక్రవర్తి అనే యువతి మొదటి స్థానంలో గెలిచి, రూ.5 లక్షల ప్రైజ్ మనీని బహుమతిగా పొందింది.
ఈ నిద్ర పోటీలో పాల్గొనేవారు 100 రోజుల పాటు రోజుకి 9 గంటల పాటు హాయిగా నిద్రపోవాలనేది పోటీ నియమం.
ఈ పోటీలో దేశంలోనే బెస్ట్ స్లీపర్ గా త్రిపర్ణ త్రివర్ణపతాకాన్ని ఎగురవేసింది.త్రిపర్ణ నిద్ర పోటీ గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంది.ఆ పోటీలో దాదాపు ఐదున్నర లక్షల మంది పోటీదారులు పాల్గొన్నారు.త్రిపర్ణ స్లీపర్ స్కోర్ 100కి 95.ఫైనల్స్ సమయంలో నిద్రను పర్యవేక్షించడానికి నిర్వహణ సంస్థ ద్వారా ఒక ప్రతినిధి బృందాన్ని కూడా పంపారు.ఈ నిద్ర పోటీని ఒక ప్రైవేటు పరుపుల కంపెనీ నిర్వహించింది.

ఈ సందర్భంగా ఆమె తల్లి మాట్లాడుతూ… తన కుమార్తెకు ఉజ్వల భవిష్యత్తు ఉందని అన్నారు.ఆమెకు చిన్నప్పటి నుండి నిద్రపోయే వ్యసనం ఉందని, కానీ ఆమె అన్ని పనులను సమయానికి చేసేదని చెప్పారు.నిజానికి ఆమెకు నిద్ర విషయంలో కొంత ఫన్నీ బ్యాగ్రౌండ్ ఉంది.ఆమె తరచూ పరీక్ష హాలులో కూడా నిద్రపోయేది.ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు కూడా ఆమెకు కళ్లు మూసుకుపోయేవి.చుట్టూ ఏం జరిగినా నిద్ర విషయంలో మాత్రం రాజీ పడేది కాదు.
అందువలనే ఈ పోటీలో నెగ్గగలిగానని ఆమె చెప్పుకొచ్చింది.







