బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభం అయింది.ఈ కార్యక్రమానికి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లను ఒక్కొక్కరిగా హౌస్ లోకి పంపిస్తున్నారు.
అయితే జబర్దస్త్ కార్యక్రమం నుంచి చలాకి చంటి బిగ్ బాస్ హౌస్లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టారు.ఇక ఈయన బిగ్ బాస్ లోకి వెళ్లబోతున్నారని గత కొద్దిరోజులుగా వార్తలు వచ్చాయి.
అయితే బిగ్ బాస్ హౌస్ కి వెళ్లే ముందు చంటి ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని తాను బిగ్ బాస్ వెళ్లడానికి గల కారణాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా చంటి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ వెళ్లాలని తాను చాలా రోజుల నుంచి అనుకుంటున్నానని నాగార్జున గారి నోటి నుంచి చంటి అనే పేరు వినాలని ఆశపడుతున్నాను అంటూ ఈయన తెలిపారు.
ఇక ప్రతి ఒక్క ప్రేక్షకుడు నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అంటూ చంటి తెలిపారు.ఇకపోతే బిగ్ బాస్ కార్యక్రమం కోసం తాను జబర్దస్త్ నుంచి బయటికి వచ్చే నేపథ్యంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న తెలిపారు.

మల్లెమాల వారు ఇచ్చే డబ్బులు తనకి ఏమాత్రం సరిపోలేదని, ఇదేంటి అని అడిగితే నీ మొహానికి ఇదే ఎక్కువ అంటూ తనని దారుణంగా అవమానించారని, తాను ఏ విషయం అయినా ముక్కు సూటిగా మాట్లాడటంతో తనని కోపిష్టి, పొగరు, అటిట్యూడ్, ఈగో’ అంటూ తన పైముద్ర వేశారని ఇవన్నీ కూడా జబర్దస్త్ నుంచి నన్ను బయటకు వెళ్ళగొట్టడం కోసమే చేశారంటూ చంటి మల్లెమాల గురించి జబర్దస్త్ కార్యక్రమం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.







