బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో సీజన్6 గ్రాండ్ గా ప్రారంభం కాగా లీకైన పేర్లలో ఉన్న కంటెస్టెంట్లు మాత్రమే షోలో కనిపించడం గమనార్హం.మొత్తం 21 మంది కంటెస్టెంట్లు పాల్గొనగా ఈ కంటెస్టెంట్లలో మెజారిటీ కంటెస్టెంట్లు తెలిసిన వాళ్లే కాగా తెలియని కంటెస్టెంట్లు కూడా కొంతమంది ఉండటం గమనార్హం.
అయితే ఈ సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్ల రెమ్యునరేషన్లు కూడా రికార్డుస్థాయిలో ఉన్నాయని బోగట్టా.
భారీగా రెమ్యునరేషన్లను ఆఫర్ చేయడం వల్ల కొందరు సెలబ్రిటీలు ఇప్పటికే ఓకే చెప్పిన ప్రాజెక్ట్ లను సైతం పక్కన పెట్టి వచ్చేశారు.
పలువురు సెలబ్రిటీలు తమ షోలను, సీరియళ్లను వదులుకుని ఈ షోలోకి ఎంట్రీ ఇవ్వడం గమనార్హం.బిగ్ బాస్ కంటెస్టెంట్లలో వారానికి లక్ష రూపాయలు తక్కువ రెమ్యునరేషన్ కాగా వారానికి 4 లక్షల ఎక్కువ రెమ్యునరేషన్ అని తెలుస్తోంది.
సెలబ్రిటీలు తమ పాపులారిటీకి అనుగుణంగా పారితోషికం అందుకుంటున్నారు.
ఆరోహీ రావు, ఇనయా సుల్తానా వారానికి లక్ష రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.

రాజశేఖర్, అభినయ శ్రీ వారానికి లక్షన్నర రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.సుదీప రెమ్యునరేషన్ సైతం దాదాపుగా ఇదే రేంజ్ లో ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.గలాటా గీతు వారానికి 1,75,000 రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారని బోగట్టా.

వాసంతి కృష్ణన్, ఫైమా వారానికి రెండు లక్షల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.సాల్మన్, శ్రీ సత్య, ఆదిరెడ్డి రెమ్యునరేషన్లు సైతం ఇదే రేంజ్ లో ఉన్నాయని బోగట్టా.మెరీనా వారానికి రెండున్నర లక్షల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది.
బాలాదిత్య, ఆర్జే సూర్య వారానికి మూడు లక్షల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారని తెలుస్తోంది.

రోహిత్ కు వారానికి మూడు లక్షల 25 వేల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ దక్కుతోందని బోగట్టా.శ్రీహాన్ మూడున్నర లక్షల రూపాయల రేంజ్ లో చలాకి చంటి, రేవంత్ వారానికి 4 లక్షల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది.







