దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి నయనతార గురించి పరిచయం అవసరం లేదు.తాజాగా ఈమె దర్శకుడు విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుని జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.
ఇక వీరి వివాహం తర్వాత వీలైనప్పుడల్లా ఇతర దేశాలను చుట్టేస్తూ ఎంతో సంతోషంగా అక్కడి అందాలను ఆస్వాదిస్తూ సంతోషంగా గడుపుతున్నారు.ఇదిలా ఉండగా తాజాగా నయనతారకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
నయనతార విగ్నేష్ పెళ్లికి ముందే ఓ ఒప్పందం కుదుర్చుకొని పెళ్లి చేసుకున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.నయనతార గర్భసంచి చాలా బలహీనంగా ఉండడంతో ఆమెకు పిల్లలు కనే యోగ్యం లేదనే వార్తలు వినపడుతున్నాయి.
ఈ క్రమంలోనే నయనతార పిల్లలను కనుక కంటే తన ప్రాణాలకు ప్రమాదం వాటిల్లుతుందని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది.అందుకే నయనతార వివాహం తర్వాత పిల్లలు కనే యోగం లేకపోవడంతో తాను సరోగసి పద్ధతి ద్వారా పిల్లల్ని కనాలని భావించారట.

ఈ విధంగా నయనతార సరోగసి ద్వారా పిల్లలను కావాలని కోరుకోవడంతో అందుకు విగ్నేష్ ఏ మాత్రం ఒప్పుకోలేదని,పెళ్లి తర్వాత వీరిద్దరూ ఒక అనాధ బిడ్డను దత్తత తీసుకొని పెంచుకోవాలని నిర్ణయం తీసుకున్నారట.ఇలా వీరిద్దరి మధ్య పిల్లల విషయంలో ఈ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాతనే వీరిద్దరూ వివాహం చేసుకున్నారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.ఇది తెలిసిన పలువురు నెటిజన్స్ నయనతారకు అన్ని కోట్లు ఆస్తి ఉన్నప్పటికీ అసలైన తల్లి ప్రేమను పొందలేదా అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.







