ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా కీలక నిర్ణయం తీసుకున్నారు.ఇకపై కారు వెనుక సీట్లో కూర్చున్నా సరే సీట్ బెల్టు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.
అదేవిధంగా ప్రతి ఒక్కరూ సీటు బెల్టు పెట్టుకుంటామని ప్రతిజ్ఞ చేయాలన్నారు.మన కుటుంబాలకు ఎంతో రుణపడి ఉన్నామన్న ఆయన.
మనం ప్రాణాలతో ఉండటం చాలా అవసరమని వ్యాఖ్యనించారు.సైరస్ మిస్త్రీ రోడ్డుప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఆయన మరణానికి సీట్ బెల్ట్ ధరించకపోవడమేనని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.ఈ నేపథ్యంలో ఆనంద్ మహీంద్రా తీసుకున్న నిర్ణయాన్ని తెలిపారు.







