టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 తాజాగా సెప్టెంబర్ 4వ తేదీన గ్రాండ్ గా మొదలైంది.ఈ క్రమంలోనే 20 మంది కంటెస్టెంట్లు గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చారు.
ఒక్కొక్క కంటెస్టెంట్ అదిరిపోయే పర్ఫామెన్స్ తో, అద్భుతమైన ఏవీలతో ఎంట్రీ ఇచ్చారు.ఇకపోతే ఈసారి బిగ్ బాస్ హౌస్ లో చాలామంది బాగా పరిచయం ఉన్న వ్యక్తులే వచ్చారు అని చెప్పవచ్చు.
మరి ముఖ్యంగా తెలుగు బుల్లితెర నటులు ఎక్కువగా వచ్చారు.ఇక బిగ్ బాస్ ప్రేమికులు ఇక తదుపరి ఎంటర్టైన్మెంట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఇకపోతే కంటెస్టెంట్లు ఒక్కొక్కరుగా ఎంట్రీ ఇస్తూ వారి జీవితంలో జరిగిన బాధాకర సంఘటనల గురించి కూడా చెప్పుకొచ్చారు.కొంతమంది కెరియర్స్ ఏ విధంగా ప్రారంభమయ్యాయి ప్రజెంట్ ఎక్కడ ఉన్నాము తర్వాత ఏం చేయాలి అన్న విషయాలను కూడా బిగ్ బాస్ స్టేజ్ పైన చెప్పుకొని ఎమోషనల్ అయ్యారు.
అటువంటి వారిలో సొలమాన్ కూడా ఒకరు.ఇతను తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి 14 కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు.ఈ కేవలం లోని బిగ్ బాస్ స్టేజిపై మాట్లాడుతూ.ఎస్ఎస్ రాజమౌళి నుంచి ఆఫర్ వచ్చిన రోజే.
తల్లి కోల్పోయాను అని తెలిపాడు.

నాపేరు షానీ నాది వండర్ ఫుల్ కహానీ చెప్పగా అతని అసలు పేరు సొలమాన్ గా చెప్పారు.జడ్చర్లకు చెందిన ఈయన ప్రొఫెషనల్ ఖోఖో ప్లేయర్.నేషనల్ లెవల్ అథ్లెటిక్స్ గోల్డ్ మెడలిస్ట్.2003లో తన కేరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అనారోగ్యం కారణంగా తన ప్రొఫెషన్ కు వీడ్కోలు పలికారు.కాగా ఆ సమయంలో రాజమౌళి సై సినిమాలో స్పోర్ట్స్ మెన్ గా ఎంపికయ్యారట.
కానీ తనకు కాల్ వచ్చిన రోజే తన మదర్ కూడా చనిపోయిందని ఎమోషనల్ అయ్యాడు.లైఫ్ అంటే హ్యాపీ వర్సెస్ సారో అని, తన ఫెవరేట్ షో బిగ్ బాస్ కు రావడం చాలా హ్యాపీగా ఉంది అని చెప్పుకొచ్చారు.







