తల పగిలింది.. ఫోటోలు తీసిన ప్రజలు.. కోమాలోకి పోయాను.. గలాటా గీతూ?

తెలుగు బుల్లితెర పేక్షకులకు గీతూ రాయల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.యూట్యూబర్‌గా, ఐటీ ఉద్యోగిగా, రివ్యూవర్‌గా, ఆర్జేగా, ఆర్టిస్టుగా ఇలా ఎన్నో రంగాలలో రాణిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది గీతూ రాయల్.

 Jabardasth Galata Geethu Royal Open Up Her Sad Background Its Really Emotional ,-TeluguStop.com

ఇక ఇటీవలే జబర్దస్త్ స్టేజ్ కి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటిని సంపాదించుకుంది గలాటా గీతు. ఇక ఇది ఇలా ఉంటే గీతు రాయల్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

తగ మొదలైన బిగ్ బాస్ సీజన్ 6 షోలోకి ఎనిమిదవ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది.ఎంట్రీ ఇవ్వడంతోనే తన చలాకీ తనంతో అందరినీ నవ్విస్తూ నాగార్జున ని కూడా ఇంప్రెస్ చేసేసింది.

ఈ నేపథ్యంలోనే తన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి పంచుకుంది.2014 లో బొమ్మరిల్లు సినిమా మాదిరిగా రన్నింగ్‌ బస్‌ నుంచి దిగే ప్రయత్నంచేయగా, ఆ క్షణంలో కింద పడిపోయి, రక్తం కారిపోతుందట.తల పై బలంగా దెబ్బ తగిలిందట.అయితే ఒక వైపు తనకు రక్తం కారుతుంటే, మరోవైపు అక్కడ జనాలంతా సెల్ఫీలు తీసుకుంటున్నార.ఇంతలోనే ఓ వ్యక్తి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళి, అతని డబ్బులు ఖర్చు పెట్టి తనకు ట్రీట్మెంట్ ఇప్పించాడట.ఆ సమయంలో ఆమె దాదాపు 24 గంటలు కోమాలోనే ఉండిపోయిందట.

Telugu Background, Bigg Boss, Galata Geethu, Geethu Royal, Nagarjuna-Movie

ఆ తరువాత మూడు నెలలు ఏం జరిగిందో తెలియదని, ఇప్పటికీ మతిమరుపు ఉంటుందని చెప్పింది.ఇక ఆ తర్వాత తన లైఫ్‌ మారిపోయిందని, అంతకు ముందు తనకు చాలా పెద్ద పేరు ఉందని, తర్వాత గీతూ రాయల్‌గా పేరుమార్చుకున్నానని, దీంతో తన సుడి తిరిగిపోయిందని చెప్పింది.ఈ నేపథ్యంలోనే తన లవ్ స్టోరీ గురించి కూడా చెప్పుకొచ్చింది గీత రాయల్.వికాస్‌ చిన్నప్పట్నుంచి ఫ్రెండ్‌ అని, పెద్దయ్యాక వాళ్ల ఫ్యామిలీ వాళ్లే తమ ఇంటికొచ్చి సంబంధం అడిగారని, అలా అరెంజ్‌ మ్యారేజ్‌ చేసుకున్నామని తెలిపింది గీతూ రాయల్‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube