నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలో విషాదం నెలకొంది.నిన్న కురిసిన వర్షానికి ఇంటి మట్టి మిద్దె కూలి దంపతులు మృతిచెందారు.
రాత్రి నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.మృతులు భోగరాజు చంద్రయ్య, వెంకటమ్మగా గుర్తించారు.
భార్యాభర్తలు ఇద్దరూ మృతిచెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







