నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది.దీంతో అప్రమత్తమైన అధికారులు ఎనిమిది క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
ప్రస్తుతం సాగర్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 1,11,536 క్యూసెక్కులుగా కొనసాగుతుంది.ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 312.0405 టీఎంసీలు కాగా.ప్రస్తుతం నీటి నిల్వ 309.3558 టీఎంసీలుగా ఉంది.అదేవిధంగా ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులుండగా.ప్రస్తుతం 589.10 అడుగులుగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు.







