టెక్నాలజీని ఉపయోగించుకుని మోసం చేస్తున్న ప్రభుత్వ వైద్యుడిని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని సస్పెండ్ చేశారు.బాపట్ల జిల్లా బల్లికురవ మండలం గుంటుపల్లి పీహెచ్‌సీలో డాక్టర్ భానుప్రకాష్వి.
ఆస్పత్రిలో రోగులను పట్టించుకోకుండా తన ప్రైవేట్ క్లినిక్ లో బిజీగా ఉండేవాడు.కానీ ప్రతి రోజూ ఆస్పత్రికి హాజరవుతున్నట్లు నమ్మించాడు.
తన కృత్రిమ వేలిని పీహెచ్‌సీ సిబ్బందికి ఇచ్చి క్రమం తప్పకుండా హాజరు వేయించేవాడు.దీంతో అటు ప్రభుత్వ విధులు, ఇటు ప్రైవేట్ క్లినిక్ వ్యాపారం సాఫీగా సాగిపోయేది.
ఈ క్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించేందుకు మంత్రి విడదల రజిని వచ్చారు.అక్కడి సదుపాయాలపై ఆరా తీశారు.
ఈ నేపథ్యంలో డాక్టర్ బాగోతాన్ని గ్రామస్తులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు.ఆస్పత్రిలోనే సిబ్బందితో కలిసి మద్యం సేవించేవారని, మహిళా సిబ్బందితో అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారని ఫిర్యాదు చేశారు.
ఈ విషయంపై స్పందించిన మంత్రి వెంటనే డాక్టర్ భానుప్రకాష్ ను సస్పెండ్ చేశారు.ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.







