టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా గుర్తింపు పొందిన బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.మొదట క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన సినీ కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మాతగా మారి ఎన్నో సినిమాలను నిర్మించాడు.
ప్రస్తుతం సినిమా నిర్మాణ పనులకు దూరంగా ఉంటూ అడపా దడపా సినిమాలలో నటిస్తున్నారు.అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వివాదాస్పదమైన ట్వీట్లు చేస్తూ తరచు వివాదాల్లో నిలుస్తూ ఉంటాడు.
సాధారణంగా పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అయిన బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా కూడా వారి మీద ఫుల్ ఫైర్ అవుతు పవన్ కళ్యాణ్ నా దేవుడు అంటూ పొగుడుతూ ఉంటాడు.
అయితే తరచు ఇలా వివాదాస్పద కామెంట్ల చేస్తు వివాదాల్లో నిలిచే బండ్ల గణేష్ తాజాగా ఐ లవ్ కేసీఆర్ సార్ అంటూ ట్విట్టర్లో పోస్ట్ షేర్ చేశాడు.
దీంతో ఎన్టీఆర్ అభిమానులు బండ్ల గణేష్ ని ట్రోల్ చేస్తూ ఒక ఆట ఆడుకుంటున్నారు.అసలు విషయం ఏమిటంటే.ఇటీవల సెప్టెంబర్ రెండవ తేదీన అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన బ్రహ్మాస్త్ర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేశారు.ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నాడు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ చివరి నిమిషంలో పోలీసులు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రద్దు చేశారు.
ఈ క్రమంలో కేసీఆర్ ఎన్టీఆర్ మీద ఉన్న కోపం వల్లే బ్రహ్మాస్త్ర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని రద్దు చేయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్ కేంద్ర మంత్రి అమిత్ షా తో భేటీ అవటం వల్ల ఎన్టీఆర్ మీద ఉన్న కోపంతోనే కెసిఆర్ కావాలని ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రద్దు చేయించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఈ విషయంపై ఎన్టీఆర్ అభిమానులు కేసీఆర్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇప్పుడు కేసీఆర్ ని సపోర్ట్ చేస్తూ బండ్ల గణేష్ ఐ లవ్ యు కేసీఆర్ సార్ అంటూ ట్వీట్ చేయటంతో ఎన్టీఆర్ అభిమానులు మరింత ఆగ్రహానికి గురవుతూ బండ్ల గణేష్ ని ట్రోల్ చేస్తున్నారు.దీంతో బండ్ల గణేష్ ఇటీవల మరొక ట్వీట్ చేస్తూ కేసీఆర్ అంటే ఇష్టమే కానీ నా ప్రియమైన హీరో ఎన్టీఆర్ అన్న కూడా నాకు చాలా ఇష్టం అంటూ మరొక ట్వీట్ షేర్ చేశాడు.
అయితే బండ్ల గణేష్ ఇలా ఎందుకు ట్వీట్ చేశాడు అన్న సంగతి గురించి ఇప్పటివరకు స్పందించలేదు.