బుల్లితెరపై ప్రసారమయ్యే అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమానికి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.ఇక ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తి చేసుకొని ఆరవ సీజన్ ప్రసారం కావడానికి సిద్ధమైంది.
నేడు సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా ప్రారంభం కాబోతోంది.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం కోసం ఎంతో మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ కార్యక్రమానికి మొదటి రోజే భారీ దెబ్బ పడబోతుందని తెలుస్తోంది.
ఎన్నో అంచనాల నడుమ ఎంతో ఘనంగా విడుదల కాబోతున్న ఈ కార్యక్రమానికి మొదటి రోజు భారీ రేటింగ్ వస్తుందని నిర్వాహకులు భావించారు.
అయితే ఈ కార్యక్రమం ప్రసారమయ్యే సమయానికి మ్యాచ్ కూడా ప్రసారం కానుంది.ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఉండడంతో బిగ్ బాస్ కార్యక్రమం పై క్రికెట్ ఎఫెక్ట్ పడనుందని తెలుస్తుంది.
ఈ క్రమంలోనే మొదటి రోజే ఈ కార్యక్రమానికి చేదు అనుభవం ఎదురుగానుందని పలువురు భావిస్తున్నారు.

ఇక ఈ మ్యాచ్ అయిపోయిన కొద్ది రోజులకే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లు స్టార్ట్ కాబోతున్నాయి.దాంతో బిగ్ బాస్ కార్యక్రమం పై పెట్టుకున్న ఆశలన్నీ కూడా ఆవిరి అవుతున్నాయని చెప్పాలి.ఇక గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ కి పెద్దగా ప్రమోషన్స్ కూడా నిర్వహించలేదని నిర్వాహకుల సైతం ఈ సీజన్ పై ఆసక్తి కనబరచలేదని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరిట ప్రసారమైన ఓటీటీ షో అట్టర్ ఫ్లాప్ కావడంతో బిగ్ బాస్ సీజన్ 6 పై ముందున్నంత బజ్ క్రియేట్ కాలేదు అని తెలుస్తుంది.అయితే ఈ కార్యక్రమం ప్రసారమయ్యి ఎలాంటి ఆదరణ పొందుతుందో తెలియాల్సి ఉంది.







