ఆ దాడులు జరగొచ్చు జాగ్రత్త ! వారికి కేసీఆర్ హెచ్చరిక

కేంద్ర అధికారి పార్టీ బిజెపి విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక క్లారిటీకి వచ్చేసారు.బిజెపితో జాతీయస్థాయిలో ఉద్యమం చేస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసుకుని బిజెపి ప్రతీకర చర్యలకు దిగుతుందనే విషయాన్ని కెసిఆర్ గుర్తించారు.

 Cm Kcr On Telangana Vimochana Dinotsavam 2022,minister Ktr, Harish Rao, Telangan-TeluguStop.com

ఇదే విషయంపై పార్టీ శ్రేణులకు హెచ్చరికలు చేశారు.నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో బిజెపి ప్రతికార చర్యలకు దిగబోతోందనే విషయాన్ని కెసిఆర్ చెప్పారు.

ఎటువంటి తప్పులకు అవకాశం లేకుండా పార్టీ శ్రేణులు అంత జాగ్రత్తగా ఉండాలని,  ముఖ్యంగా మంత్రులు ఈ విషయంలో అలసత్వం వహించవద్దని కెసిఆర్ హెచ్చరించారు.సిబిఐ,  ఈడి ,ఐటీ సంస్థలు టిఆర్ఎస్ నాయకులే టార్గెట్ గా వేధింపులకు దిగే అవకాశం ఉందని , బిజెపి నుంచి ఎదురయ్యే ఎటువంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, కెసిఆర్ సూచించారు.

సిబిఐ విచారణ విషయంలో రాష్ట్రాల అనుమతి తప్పనిసరిగా తీసుకునే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకు వద్దామని మంత్రులకు సూచించారు.ఈ విషయంలో న్యాయపోరాటం చేసేందుకు అయినా సిద్ధమంటూ కేసీఆర్ ప్రకటించారు.

ఇప్పటికే కేంద్ర మంత్రులు తెలంగాణ పర్యటన చేపడుతూ,  టిఆర్ఎస్ ను టార్గెట్ గా చేసుకుని విమర్శలు మొదలుపెట్టారని,  ఈ సమయంలో రాష్ట్ర మంత్రులంతా అలర్ట్ గా ఉంటూ ఆ విమర్శలను తిప్పికొట్టాలని , ఈ విషయంలో ఎటువంటి అలసత్వం వహించవద్దని మంత్రులకు సూచించారు.దేశవ్యాప్తంగా బిజెపి వ్యతిరేక పార్టీలను టార్గెట్ చేసుకుని కేంద్రం ఏ విధంగా వేధింపులకు పాల్పడుతుంది అనే విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు.

ప్రస్తుతం ఈ వ్యవహారం పైనే పార్టీ నేతలు అందరికీ ఆదేశాలు వెళ్ళినట్లు సమాచారం.

Telugu Central, Cm Kcr, Harish Rao, Ktr, Telangana, Trs-Politics

16, 17, 18 తేదీల్లో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల పేరుతో ఘనంగా నిర్వహించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.ఇక ఇప్పటికే కేంద్ర మంత్రులు వరుసగా తెలంగాణలో పర్యటిస్తున్నారు.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మూడు రోజుల పాటు తెలంగాణలో హల్ చల్ చేశారు.

ఈ సందర్భంగా టిఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని అనేక విమర్శలు చేయగా,  దానికి మంత్రి హరీష్ రావు కేటీఆర్ వంటి వారు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube