పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఉండరు.కేవలం భక్తులు మాత్రమే ఉంటారు అనేది ఆయన యొక్క అభిమానుల మాట.
సందర్భానుసారంగా ఆ అభిమానులు చేసే హడావుడి కొన్నిసార్లు చాలా మందికి ఇబ్బందులను కూడా కలిగిస్తుంది.అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ కి కూడా వారి యొక్క అభిమానం చిరాకు తెప్పిస్తూ ఉంటుంది.
తాజాగా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో జల్సా సినిమాను భారీ ఎత్తున స్క్రీనింగ్ చేసిన విషయం తెలిసిందే.ఆ సమయంలో అభిమానులు కొన్నిచోట్ల చేసిన హంగామా కారణంగా థియేటర్లో ధ్వంసం అయ్యాయి.
దాంతో లక్షల్లో ఆస్తి నష్టం జరిగిందంటూ థియేటర్ల యాజమాన్యం గగ్గోలు పెడుతున్నారు.అయినా కూడా అభిమానులు మాత్రం తమకేం సంబంధం లేదు అన్నట్లుగా వారి పనిలో వారు పడ్డారు.
ఇప్పుడు అంతా పవన్ కళ్యాణ్ ని వేలెత్తి చూపిస్తున్నారు.మీ అభిమానులు ఇలాంటి అరాచకాలు చేస్తుంటే నువ్వేం స్పందించవా అంటూ ప్రశ్నిస్తున్నారు.
కనీసం నీవు వారిని హద్దుల్లో పెట్టుకునేలా ఒక్క సారి అయినా మాట్లాడవా అంటూ కొందరు పవన్ కళ్యాణ్ ని ప్రశ్నిస్తున్నారు.ఇటీవల ఒక అధికార పార్టీ నేత మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అభిమానులు అంత దారుణాలకు పాల్పడుతున్న నేపథ్యంలో థియేటర్ల యాజమాన్యాలు ఆయన సినిమాలను బ్యాన్ చేయాలని, ఆయన నటించిన ఏ ఒక్క సినిమా ని కూడా తమ థియేటర్లలో విడుదల చేయ వద్దని సలహా ఇచ్చారు.
అలాంటి సలహాలు పవన్ ప్రత్యర్థులు ఇస్తున్నారు అంటే కేవలం ఆయన అభిమానుల వల్లే అనడంలో సందేహం లేదు.ఆయన అభిమానులు సరిగ్గా ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవే కావు అంటూ కొందరు అభిప్రాయం చేస్తున్నారు.
ముందు ముందు అయినా పవన్ కళ్యాణ్ అభిమానులు క్రమశిక్షణతో వ్యవహరిస్తారని వారు పవన్ కళ్యాణ్ మాదిరిగా ఒక మంచి నాయకుడిగా ఒక మంచి వ్యక్తిగా క్రమశిక్షణ కలిగిన లక్షణాలున్న వ్యక్తిగా మారుతారని ఆశిద్దాం.