జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ పోలీసుల తీరుపై మండిపడ్డారు.జనసేన పార్టీకి చెందిన వెంకట మహేష్ నీ అరెస్టు చేయటాన్ని ఖండించారు.
జనసేన పార్టీకి చెందిన దిమ్మలను వైసీపీ నాయకులు పగల పడితే వారిపై ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నల వర్షం కురిపించారు.రాష్ట్ర పోలీసుల తీరు మారకపోతే తానే రోడ్ ఎక్కాల్సి వస్తుందని హెచ్చరించారు.
శాంతిభద్రతలకు ఎక్కడ విఘాతం కలగకుండా ఉండాలని తాను సంయమనం పాటిస్తున్నట్లు స్పష్టం చేశారు.
పార్టీ నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమానికి పోలీసులు అడ్డుపడుతున్నారని.
అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.వైసీపీ పార్టీ నేతలు వాడవాడలో పెడుతున్న విగ్రహాలు మరియు జండా దిమ్మలకు ముందస్తుగా మున్సిపల్ మరియు పంచాయతీల అనుమతి తీసుకుంటున్నారా.? అని ప్రశ్నించడం జరిగింది.జనసేన పార్టీని ఎవరు ఏమి చేయలేరు.
, ప్రజలే కాపాడుకుంటారని తెలిపారు.వైసీపీ నాయకులు ఈరోజు ఉంటారు రేపు పోతారు వచ్చే ఎన్నికల తర్వాత మరో పార్టీ అధికారంలోకి వస్తే పోలీసులు తలదించుకునే పరిస్థితి రాకూడదు అని కోరుకుంటున్నాట్లు చెప్పుకొచ్చారు.







